Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

సెంట్ థెరిసా పాఠశాల లో ఘనంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు

(జై భారత్ వాయిస్ న్యూస్ఆత్మకూరు):
ఆత్మకూరు మండల కేంద్రంలోని సెయింట్ థెరీసా ఉన్నత పాఠశాలలో సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆ పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ జాయిస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జూబ్లీ ఉత్సవాలలో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఈ పాఠశాల ప్రారంభించినప్పటి నుంచి పేద,బడుగు బలహీన వర్గాలకు విద్యనందిస్తున్నదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రైవేటు పాఠశాలలు పుట్టుకొస్తున్నప్పటికీ వాటికి దీటుగా తక్కువ ఫీజులతో ప్రాంతీయ భేదాలు లేకుండా కులమతాలకు అతీతంగా విద్యార్థులకు విద్యను అందిస్తున్నారని చెప్పారు. పాఠశాలలో విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాలు విద్యార్థులకు అందిస్తున్నారని ఆయన చెప్పారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని అన్నారు. పాఠశాలకు వచ్చే మార్చి బడ్జెట్ తర్వాత రోడ్డు వేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ బిషప్ ఉడుముల బాల మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుంచి ఈ పాఠశాల అనేక రకాలుగా విద్యార్థులకు సేవలందిస్తూ విద్యనందిస్తున్నదని వివరించారు. ఈ పాఠశాల మున్ముందుకు ఉత్తమ ఫలితాలు సాధించి పైకి ఎదగాలని అన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ జాయిస్ మాట్లాడుతూ ఈ ఉన్నత పాఠశాల గత 25 సంవత్సరాలుగా విద్యార్థులను విద్యతో పాటు అనేక రంగాలలో తీర్చిదిద్దుతున్నదని చెప్పారు. పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్ వంటి వాటిని ఏర్పాటు చేశామని పాఠశాల పురోగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రొవిజినల్ మదర్ యూనిస్ తోపాటు ఆత్మకూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి, గతంలో పాఠశాల లో పనిచేసిన ప్రిన్సిపాల్లు తేస్సి, జైన్ మేరీ, సిస్టర్ నిర్మల ,సిస్టర్ క్రిష్టి, ఫాదర్స్ , పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాల లో రాణించిన విద్యార్థులకు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి , బిషప్ వుడుముల బాల మెడల్స్ తో పాటు ప్రశంస పత్రాలను అందించారు. విద్యార్థులను వారు అభినందించారు. సిల్వర్ జూబ్లీ ఉత్సవాలలో పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి.

Related posts

తల్లుల ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలి -జాతరలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

Jaibharath News

గవర్నర్ సమావేశంలో పాల్గొన్న ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్!

జనం నుండి వనం కేగిన అమ్మవార్లు ” -జాతర మహాగట్టం ముగిసింది.

Jaibharath News