Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మాదిగల మహాగర్జన కరపత్రాలు ఆవిష్కరణ

జైభారత్ వాయిస్ న్యూస్ నవంబర్ 29 వరంగల్ ప్రతినిధి:-
వరంగల్ కాశిబుగ్గ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జంక్షన్ లో ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు నమిండ్ల క్లైమేoట్ ఆధ్వర్యంలో ఏబిసిడిలుగా వెంటనే విభజించాలని కరపత్రాల విడుదల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఎమ్మార్పీఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ దళిత రత్న కేదాసి మోహన్ మాదిగ హాజరై కరపత్రాలను అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని ఎస్సీలను ఏబిసిడిలుగా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈనెల 30 నుండి డిసెంబర్ 30వ తారీకు వరకు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలో మోటారు సైకిల్ ర్యాలీలు చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల జరుగుతున్న నిర్లక్ష్యాన్ని మాదిగ జాతికి జరుగుతున్న అన్యాయం పట్ల జాతి ప్రజలకు తెలియ చేయడం జరుగుతుందని అన్నారు. జనవరి 19న హైదరాబాదులో జరిగే మాదిగల మహాగర్జనకు లక్షలాదిగా తరలివచ్చి జయంప్రదం చేయాలని కోరారు.
ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు నమిండ్ల క్లైమెంట్ మాదిగ మాట్లాడుతూ.. గత పదేళ్లలో మాదిగలు తీవ్రంగా నష్టపోయినారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయి విజయోత్సవాలు చేసుకుంటున్న తరుణంలో మాదిగ జాతికి సంక్షేమ పథకాల ద్వారా ఎలాంటి న్యాయం జరిగిన దాఖలాలు లేవని అన్నారు. మనం పోరాటాల ద్వారానే ప్రతిదీ సాధించుకోవాలి మనకు పోరాటాలు కొత్త కాదు రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 30 నుండి ప్రారంభమయ్య బైక్ ర్యాలీలో విజయవంతం చేస్తూ జనవరి 19న హైదరాబాదులో జరిగే మహా గర్జనకు లక్షలాది మంది మాదిగల తరలివచ్చి మహా గర్జనను విజయవంతం చేయాలని మాదిగ జాతికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్ముల బిక్షపతి జిల్లా ఉపాధ్యక్షులు చింత జోసెఫ్ జిల్లా కార్యదర్శి విద్యాసాగర్ జిల్లా యువసేన అధ్యక్షులు ప్రేమ్ సాగర్ గీసుగొండ మండల అధ్యక్షులు బరిగల యాకోబు సంగెం మండల అధ్యక్షులు జంగిలి రాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అల్లం స్వప్న దేవి బాలకిషోర్ రెడ్డి మహా అన్నప్రసాదా కార్యక్రమం

Sambasivarao

మామునూర్, ఎయిర్ పోర్ట్ పై సమీక్ష

ఏ ఈ ఓ ఆబిద్ కు ఆత్మీయ సన్మానం