ప్రణాళికబద్ధంగా చదివితే రాణించవచ్చు..
యువ సైంటిస్ట్ డాక్టర్ తోట శ్రవణ్‌కుమార్
కేయూ క్యాంపస్, నవంబరు 30 : విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదవడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చని యువ సైంటిస్ట్ డాక్టర్ తోట శ్రవణ్‌కుమార్ అన్నారు. కేయూ క్యాంపస్‌లోని కెమెస్ట్రీ డిపార్ట్‌మెంట్‌లో శనివారం ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. కెమిస్ట్రీ విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు పెరుగుతున్నాయని, సబ్జెక్టుపై పట్టు సాధించడం ద్వారా వాటిని అందిపుచ్చుకోవచ్చని అన్నారు. కేయూలో ఎం.ఎస్సీ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ కోర్సు మొదటిబ్యాచ్ విద్యార్థినైన తాను ఎంతో కష్టపడి చదివి అమెరికాలో సైంటిస్టుగా స్థిరపడ్డానని తెలిపారు. ఈ సందర్బంగా కెమిస్ట్రీ రంగంలో వస్తున్న నూతన మార్పులపై ఆయన విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో కెమెస్ట్రీ డిపార్ట్‌మెంట్ హెడ్ సవితాజ్యోత్స్న మాట్లాడుతూ శ్రవణ్ లెక్చర్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. కాగా, వరంగల్ లోని ఏకశిలా నగర్ కు చెందిన శ్రవణ్ ప్రస్తుతం అమెరికా లో సైంటిస్టు గా స్థిరపడ్డారు.