జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
ఆత్మకూరు: మధ్యాహ్న భోజనం పథకానికి ప్రభుత్వం నిధులు పెంచాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కోరుతూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఆధ్వర్యంలో ఆత్మకూరు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి మండల తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మండల తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి డి.తిరుపతి మాట్లాడారు. నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్న మధ్యాహ్న భోజనం పథకానికి మాత్రం నిధులు పెంచకపోవడం వల్ల విద్యార్థులు నాణ్యమైన భోజనం అందడం లేదని, ఒక్క విద్యార్థికి రోజుకు 8 నుంచి 10 రూపాయలు ఇస్తే ఏ రకమైన పౌష్టికాహారం తింటారని, ప్రభుత్వం అందించే పైసలతో కనీసం బయట టి కూడా రావడం లేదని, కానీ అవే డబ్బులతో భోజనం అందించాలని చెప్పడం విద్యార్థులను ఆకలితో ఇబ్బందులు చేయడమే అన్నారు.రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఫుడ్
ఫాయిజన్ ఘటనలు, విద్యార్థుల మరణాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే సమీక్షా సమా వేశాన్ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలలు, హాస్టళ్లలో వరుస ఘటనలు జరుగుతున్నా అధికారు లపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు. మధ్యాహ్న భోజనానికి ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న నిధులు సరిపోవడం లేదని, నిధులు పెంచాలని కోరారు. సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలో ప్రధానంగా జీసీసీ ద్వారా నాసిరకం సరుకులు సరఫరా చేస్తున్నారని తెలిపారు, జీసీసీపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సరుకుల సరఫరాలో నిర్లక్ష్యం చేస్తున్న జీసీసీ మేనేజర్లపై చర్యలు తీసుకో వాలని కోరారు. పెంచిన మెస్, కాస్మోటిక్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు ఎం.అఖిలేష్, బి. చరణ్, డి.నాగచరణ్,పి. అజయ్, బి.శివమణి, జస్వంత్,లు పాల్గొన్నారు.

previous post
next post