(జై భారత్ వాయిస్ న్యూస్ డిసెంబర్ 2)
గీసుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్టపై శాశ్వత రేకుల పందిరి నిర్మాణానికి 1,00,116/ రూపాయలు బృహత్తర విరాళం గీసుకొండ గ్రామ పెగళ్ళపాటి గీత -లక్ష్మీనారాయణ దంపతులు దేవాలయం కమిటీ సభ్యులకు అందజేశారు. గీసుకొండ గ్రామంలోని చారిత్రక పుణ్య క్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్ట మీద శాశ్వత రేకుల పందిరి షెడ్డు నిర్మాణానికి, గీసుకొండ గ్రామానికి చెందిన రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ దంపతులు రూ1,00,116/- ల బృహత్తర విరాళాన్ని అందజేశారు. ఈకార్యక్రమంలో గీసుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం/ జాతర చైర్మన్ ఏనుగుల సాంబరెడ్డి, శ్రీ బసవేశ్వర శివాలయం చైర్మన్ చాడ సంజీవరెడ్డి, దేవాలయ కమిటీ సభ్యులు రామా కుమారస్వామి, యాదగిరి లక్ష్మణ్ గురుస్వామి ముల్క ప్రసాద్ వాజపేయి పాల్గొన్నారు. దేవాలయంకు విరాళం అందచేసినందుకు గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు.

previous post