జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ వద్ద నిర్వహించ తలపెట్టిన సభను విజయ వంతం చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఆత్మకూరు మండలం అగ్రంపహడు జాతర సమీపంలో సంగెం, గీసుగొండ, ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,ముఖ్య నాయకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…శనివారం రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు సంగెం, గీసుగొండ మండలాల పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. అలాగే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పైలాన్ వద్ద నిర్వహించే సభకు బూత్ స్థాయి కార్యకర్తలు హాజరు కావాలన్నారు. టెక్స్టైల్ పార్క్ నిర్మాణంలో భూమి కోల్పోయిన 863 మంది రైతులకు డ్రా పద్ధతిలో ప్లాట్ నెంబర్లను ఇవ్వబోతున్నామని, తెలిపారు. టెక్స్టైల్ పార్కును సందర్శిస్తారని చెప్పారు. గొర్రెకుంట లో బ్రాహ్మణ భవన్ ని ప్రారంభిస్తారని, అలాగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద యెత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కమలాపురం రమేష్,బీరం సుధాకర్ రెడ్డి , బొరిగం స్వామి, ముద్దం సాంబయ్య, పరికరాల వాసు, తనుగుల సందీప్, మాదాసి శ్రీధర్,తదితరులు పాల్గొన్నారు. తొలుత సమ్మక్క సారలమ్మ తల్లులకు పూజలు నిర్వహించారు
