(జై భారత్ వాయి విజయవాడ) : వికసిత్ ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాల మేరకు ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తిని ఎంటర్ ప్రెన్యూర్ గా తయారు చేసే దిశగా ఎంపి కేశినేని శివనాథ్ కృషి చేస్తున్నారని టిడిపి రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం తెలిపారు.ఎన్టీఆర్ జిల్లాలో నిరుద్యోగ యువతతో పాటు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, చిరు వ్యాపారులకు స్వయం ఉపాధి అవకాశం కల్పించేందుకు హైదరాబాద్ లోని జాతీయ గ్రామీణాభివృద్ది సంస్థ (ఎన్.ఐ.ఆర్.డి) లో స్వయం ఉపాధి పథకాలపై అవగాహన, శిక్షణ ఇప్పించేందుకు ఎంపి కేశినేని శివనాథ్ చేపట్టిన కార్యక్రమ వివరాలు తెలిపేందుకు మాదిగాని గురునాథం ఆదివారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లోని ఎన్.ఐ.ఆర్.డి లో కేంద్ర ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం అందిస్తున్న పథకాలపై నిరుద్యోగత యువతకు అవగాహన కల్పించి ఆతర్వాత శిక్షణ ఇప్పించేందుకు మొదటి విడతగా 50 మందిని సోమవారం తెల్లవారు జామున బస్సులో హైదరాబాద్ కి తీసుకువెళుతున్నట్లు తెలిపారు.ఎంపి కేశినేని శివనాథ్ ఈబృహత్తర కార్యక్రమాన్ని మొదలు పెట్టారన్నారు. యువతకు స్వయం ఉపాధి పై అవగాహన, శిక్షణ ఇప్పించటంతో పాటు ఆసక్తి గలవారికి రుణాల మంజూరయ్యేలా ఎంపి కేశినేని శివనాథ్ బ్యాంకర్లతో మాట్లాడం జరిగిందని తెలిపారు.. ఇక ఎన్టీఆర్ జిల్లాలో నిరంతరంగా జరగబోయే ఈ కార్యక్రమం ప్రతి వారం వుంటుందన్నార. రాబోయే నాలుగేళ్లలో జిల్లాలో 40 వేల మంది నిరుద్యోగులని, ఏడాదికి పదివేలమంది చొప్పున ఎంటర్ ప్రెన్యూర్స్ గా తయారు చేసేందుకు ఎంపి కేశినేని శివనాథ్ చక్కటి ప్రణాళిక సిద్దం చేసి అమలు పర్చనున్నారని తెలిపారు.అనంతరం విజయవాడ అర్బన్ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు జి.వి.నరసింహారావు మాట్లాడుతూ ఎంపి కేశినేని శివనాథ్ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిస్ జనరేషన్ ప్రొగ్రామ్ (P. M.E.G.P), ఎమ్.ఎస్.ఎమ్.ఈ పథకాల పై జిల్లాలోని నిరుద్యోగ యువతకు నిరంతరం ఎన్.ఐ.ఆర్.డి లో అవగాహన, శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఎంపి కేశినేని శివనాథ్ యువత లో దాగి వున్న వారి శక్తి సామర్థ్యాలు వెలికితీసి వారి ఔత్సాహికతను బట్టి రుణాలు అందేలా కూడా కృషి చేస్తున్నారన్నారు. అలాగే ఈ జిల్లాలో వున్న ఎన్.ఐ.ఆర్.డి సంస్థ అధికారులతో కూడా మాట్లాడి ఈ పథకం గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో వున్న నిరుద్యోగ యువతకి అందేలాగా తగిన చర్యలు తీసుకున్నారని చెప్పారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ, టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిశపోగు రాజేష్ , టిడిపి సీనియర్ నాయకులు నరసింహా చౌదరి, మాజీ మేయర్ తాడి శకుంతల, టిడిపి నాయకులు పామర్తి కిషోర్ బాబు, డాక్టర్ చైతన్య, అబీద్ హుస్సెన్ పాల్గొన్నారు.
next post