Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

తెలంగాణ రాష్ట్ర ప్ర‌దాత సోనియా గాంధీ

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)తెలంగాణ 60 ఏళ్ల స్వ‌ప్నాన్ని సాకారం చేసిన గొప్ప నేత‌ తెలంగాణ రాష్ట్ర ప్ర‌దాత సోనియా గాంధీ అని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించారని పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాదాసి శ్రీధర్ అన్నారు.పరకాల అభివృద్ధి ప్రదాత రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ సెంటర్లో సోమవారం సోనియాగాంధీ జన్మదిన వేడుకలను మండల యూత్ అధ్యక్షులు తనుగుల సందీప్ ఆధ్వర్యంలో బానసంచ కాల్చి, స్వీట్లు,పండ్లు ప్రజలకు పంపిణి చేసి ఘనంగా నిర్వహించారు.పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాదాసి శ్రీధర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ యువత ప్రాణ త్యాగాలను చూసి చెల్లించి పోయిన సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని చెప్పారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని కొనియాడారు. ఇకముందు కూడా తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ గారికి ఉండగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి,అసెంబ్లీ ప్రధాన కార్యదర్శులు దామెర రాజు,కొమ్ము శ్రవణ్,మండల ఉపాధ్యక్షులు మడిపెల్లి రాజు,గుండెబోయిన అజయ్,ప్రధాన కార్యదర్శులు బండారి శివ,ఇమ్మడి పవన్,కార్యదర్శి రాజు, పోలేపాక వినోద్,గ్రామ అధ్యక్షులు కుక్కల రమేష్,షరీఫ్,శ్రీశైలం,కరీం, కమలాకర్,భాస్కర్, మురళి, దూరిశెట్టి శ్రవణ్ అధిక సంఖ్యలో యోజన నాయకులు పాల్గొన్నారు.

Related posts

జర్నలిస్ట్ మెరుగు శ్రీనివాస్ ను పరామర్శించిన మంత్రి సీతక్క

Sambasivarao

నీరుకుల్ల గ్రామంలో సంచరిస్తున్న పునుగు పిల్లులు

28న ఉచిత ధ్యాన శిక్షణ