Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

సిఎం కప్ మండల స్థాయి క్రీడలు ప్రారంభం

(జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ )
గీసుకొండ మండలములోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలలో ప్రభుత్వ పాఠశాలలు,యువకులు క్రీడా పోటీలను .గీసుకొండ మండల ప్రత్యేక అధికారి  సురేష్, ఎంపీడీఓ వి.కృష్ణవేణీ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  మండల స్థాయి క్రీడా పోటీలు 12వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు.విద్యార్థులు చిన్నప్పటినుంచి క్రీడా పోటీల్లో మంచి నైపుణ్యత శిక్షణ పొంది పోటీలలో గెలుపొంది గ్రామానికి మండలానికి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు మండల స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులను   జిల్లా స్థాయి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు మొదటి రోజు వాలీబాల్ కోకో కబడ్డీ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ సాంబయ్య,గీసుకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పట్టాభి, వివిడ గ్రామాల వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్ధిని విద్యార్థులు,  పాల్గొన్నారు.

Related posts

ఎమ్మెల్యే  ధర్మారెడ్డిని మరోసారి గెలిపించాలి

తెలంగాణ రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ ఐ యోగ పోటీలు ప్రారంభం

ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఎన్నికలు

Sambasivarao