Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డుకు నత్తి కోర్నేల్ ఎంపిక

(జై భారత్ వాయిస్. న్యూస్ ఆత్మకూరు ):
ఆత్మకూరు మాజీ ఎంపీటీసీ నత్తి కోర్నెల్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డుకు ఎంపిక అయ్యారని బహుజన సాహిత్య అకాడమి జాతీయ అధ్యక్షుడు నల్లా రాధా కృష్ణ తెలిపారు. ఈ జాతీయ అవార్డును ఈనెల 15వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏర్పాటుచేసిన సభలో తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా అవార్డు అందుకుంటున్న సందర్భంగా నత్తి కోర్నెల్ మాట్లాడుతూ కుల సంఘాలు ప్రజా సంఘాలు స్వచ్ఛంద సేవా సంస్థలు, మేధావుల ప్రోద్బలంతో నే ఈ అవార్డు వచ్చిందని అన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాని తెలిపారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించి సమ సమాజ స్థాపనకు కృషి చేస్తానని అంబేద్కర్ పూలే ల ఆలోచన స్ఫూర్తితో ముందుకు సాగుతానని తెలిపారు.

Related posts

కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి జాక్ చైర్మన్ గజ్జెల రామ్ కిషన్

ఆత్మకూరు నుంచి మొదలైన కాంగ్రెస్ ప్రచారం

Jaibharath News

మే 2న రెడ్డి కృతజ్ఞత సభను విజయ వంతం చేయాలి