గ్రేటర్ వరంగల్ నగరంలోని అజాంజహి మిల్లు వర్కర్స్ యూనియన్ కార్యాలయం కూల్చివేయడం ఆ యొక్క భూమిలో కాసం షాపింగ్ మాల్ నిర్మాణం కొరకు ఇచ్చిన అనుమతులను రద్దు చేసి వెంటనే నిర్మాణం నిలిపివేయాలని డిమాండ్ చేస్తు గురువారం నాడు బిజెపి కార్పొరేటర్లు బిజెపి నాయకులతో కలిసి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవి కుమార్, కార్పొరేటర్లు గురుమూర్తి శివకుమార్, చాడ స్వాతి, బైరి లక్ష్మి, రావుల కోమల, గుజ్జుల వసంత, జలగం అనిత, ఆడేపు స్వప్న, గందే కల్పన, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావుల కిషన్, కుసుమ సతీష్, తదితరులు పాల్గొన్నారు.