Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

హాస్టల్ పరిసరాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

ప్రైవేట్ హాస్టల్స్ తప్పని సరిగా సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ ప్రైవేట్ హాస్టల్స్ యజమానులకు సూచించారు. నేరాల నియంత్రణలో భాగంగా హనుమకొండ డివిజనల్ పోలీసుల ఆధ్వర్యంలో హనుమకొండలోని ప్రైవేట్ హాస్టల్స్ యజమానులతో భీమారంలోని శుభం కళ్యాణ వేదికలో సిపి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా హాస్టల్ యాజమాన్యం తీసుకోవల్సిన చర్యలపై పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేశారు. ఇందులో ప్రధానంగా హాస్టల్ వచ్చి పోయే వారి వివరాలను ఎప్పటికప్పుడు నోట్ చేసుకోవాలని, అలాగే హాస్టల్ ఉండే వారి దినచర్య పై నజర్ పెట్టాలని. రాత్రి సమయాయాల్లో వారిని బయటికి వెళ్లేందుకు అనుమతించవద్దని, వీరి కోసం వచ్చే వారి గురించి తగిన సమాచారం తీసుకోవాలని. స్థానిక పోలీసుల సహకారం తీసుకోనే విధంగా యాజమాన్యం ఈనెల 31 తారీకులో తగు చర్యలు తీసుకోవాలని, జనవరి నుండి హాస్టల్స్ ముమ్మరంగా తనిఖీలు చేపట్టడం జరుగుతుందని. సూచనలు పాటించని హాస్టల్స్ పైచర్యలు తీసుకోబడుతాయని సిసి తెలిపారు. ఈ కార్యక్రమం ఎ. ఎస్. పి భట్, ఏసీపీ దేవేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు సతీష్, రవి కుమార్ ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

సీతక్క చే గణిత పుస్తక ఆవిష్కరణ

Jaibharath News

సీఎం రేవంత్ కి కాంగ్రెస్ నేతల ఘన స్వాగతం గూడెప్పాడ్ వద్దా గజమాలతో సన్మానం.

Jaibharath News

జనం నుండి వనం కేగిన అమ్మవార్లు ” -జాతర మహాగట్టం ముగిసింది.

Jaibharath News