Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

రైతులు పండించిన పంటపై మెళకువలు పాటిస్తే ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
రైతులు పండించిన పంటపై మెళకువలు పాటిస్తే ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర దక్కి, సాగు లాభసాటిగా వుంటుందని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా పేర్కొన్నారు.శనివారం వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యానవనాల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామ రైతు వేదిక వద్ద మిరప కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏర్పాటుచేసిన రైతు అవగాహన మరియు శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్యఅతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, పంట పండించిన రైతన్నలు, కోతల సమయంలో కూడా తప్పనిసరిగా కొన్ని మెళకువలు పాటించాలని, లేనిచో తాలు అధికంగా వచ్చి, నిల్వలో అఫ్లోటాక్సిన్స్ వల్ల నాణ్యత దెబ్బతినే ప్రమాదం వుందని. ఈ సమస్యలను అధిగమించి, నాణ్యమైన దిగుబడులు, అధిక ధర పొందాలంటే కోతలు, అనంతరం కాయలు ఆరబెట్టే సమయంలో కూడా శాస్ర్తీయ విధానాలను పాటించాల్సిన అవసరం ఉందన్నారు.మిరప పంట సాగు చేసిన రైతులు పంట కోత తరువాత ఎండలో ఆరబెట్టి నాన తాప రవాణా ప్రకారం కాల పరిమాణం రంగు ఆధారంగా గ్రీటింగ్ చేసుకొని వేరువేరుగా మార్కెట్లకు తీసుకెళ్లడం ద్వారా అధిక ధరలు పొందే అవకాశం ఉంటుందని, రైతులు వాడి క్రిమిసంహారక మందుల విషయంలో వ్యవసాయ మరియు ఉద్యానవన శాఖ అధికారుల సూచనలు పాటించడం ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి ప్రమాణాలు గల మిరప వంటను పండించవచ్చుని, ఉద్యాన శాఖ అధికారులు ఈ ఉద్యాన పంటలు సాగు చేయు రైతులకు ఎప్పటికపుడు సూచనలు,సలహాలు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా గాని లేదా యూట్యూబ్ల ద్వారా గాని నేరుగా రైతులు మొబైల్ కి పంపించాలని అన్నారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మిరప పంట సాగు సీజన్ కంటి ముందు జూన్ జూలై మాసాలలో ఏర్పాటు చేయడం వలన రైతులకు పెట్టుబడి భారం తగ్గించడంతోపాటు నాణ్యతమైన దిగుబడులు సాధించి అధిక మార్కెట్ ధరలు పొందే అవకాశం ఉందన్నారు.ఉద్యానవన శాస్త్రవేత్తలు నాగరాజు, వీరన్న పాల్గొని మిరప పంటలో పీడల నివారణ చేపట్టాల్సిన చర్యల పైకూలంకషంగా వివరించారు.అనంతరం క్షేత్రస్థాయిలో అధికారులు రైతులతో కలిసి కలెక్టర్ మిర్చి పంటను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, ఆర్డిఓ రమాదేవి, మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి, ఏనుమాముల మార్కెట్ కార్యదర్శి నిర్మల, మార్కెటింగ్ ఆధికారి సురేఖ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అన్నదానం చేసిన సాయి తిరుపతి రెడ్డి

వీరనారి చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి పురస్కరించుకొని ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నాగేల్లి వెంకటనారాయణ గౌడ్

Sambasivarao

ఉదృతంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షలు

Jaibharath News