Jaibharathvoice.com | Telugu News App In Telangana
జాతీయ వార్తలు

కాశీ లో మయూరి కళాకారుల ప్రదర్శన

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
భారతీయ సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ గంగనది లో జరగనున్న మహాకుంభ మేళలో భాగంగా ఉత్తర భారతదేశం లోని, వారణాసి లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన కాశి విశ్వనాథుని ఆలయ ప్రాంగాణం లో ఆలయ కమిటి నిర్వహించిన ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఓరుగల్లు కళా కారులు పాల్గొని తన ప్రతిభను చాటారు. పెంచికలపేట కు చెందిన హన్మకొండ లోని మయూరి నాట్య కళాక్షేత్రం విద్యార్థులు పలు సాంస్కృతిక నృత్యాలతో ఆహుతులను అలరించారు. ఇందులో భాగంగా గంగానది తీరంలోని అస్సి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై చిన్నారులు చేసిన నమఃశ్శివాయతే, గంగప్రవేశం నృత్య రూపకాలకు మంత్రాముగ్దులు అయ్యారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన కాశి విశ్వనాధ ఆలయ కార్య నిర్వహనాధికారి విశ్వభూషణ్ మిశ్రా, ఏ సీపీ శివచిన్నప్ప , వారణాసినిర్వాహకులు చెప్పారు ఈ కార్యక్రమం లో మయూరి నాట్య కళాక్షేత్రం వ్యవస్థపాక నాట్య గురువు శ్రీమతి కుండె అరుణ రాజ్ కుమార్ ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.

Related posts

జమ్ము కాశ్మీర్ లో ఎన్నికలు ప్రశాంతం

ఎమ్మెల్సీ కవితపై ఈడీ కేసు అక్రమం

కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల