జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ
హనుమకొండ జిల్లా కేంద్రంలోని జె ఎన్ ఎస్ గ్రౌండ్స్ లో జరిగిన ప్రతిష్టాత్మకమైన చీఫ్ మినిస్టర్ కప్ అండర్ 19 యోగా పోటీలలో శాయంపేట మండలం పత్తిపాక ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 30 డిసెంబర్ నుండి 3జనవరి2025 వరకు హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం హైదరాబాదులో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించబడతాయి. పాఠశాల నుండి గడ్డి నవదీప్ రిథమిక్ యోగ, గజ్జి వరుణ్ ఆర్టిస్టిక్ యోగ, గజ్జి రాజేష్, సిలివేరు వరుణ్ ట్రెడిషనల్ యోగ స్థానాలలో రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొననున్నారు. వీరి ఎంపికకు కృషిచేసిన వ్యాయామ ఉపాధ్యాయుడు బొలిశెట్టి కమలాకర్ ను ప్రధానోపాధ్యాయులు మాధవి ఉపాధ్యాయులు రఘు అనిత సోంబాబు విజయ్ కుమార్ కిరణ్మయి. విజయ రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులను స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అభినందించారు.
