ఎక్కడో పుట్టి యుక్త వయస్సు ఒక్కటైనారు కలిసి మెలిసి విద్యాబుద్ధులు నేర్చుకున్నారు వివిధ ప్రాంతాల్లో వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు విధులను నిర్వర్తించి ఉత్తమ సేవలు అందించారు కొంతమందికి అవార్డులు అందుకున్నారు వివిధ రకాల వృత్తుల్లో రిటైర్మెంట్ అయినారు అయినా వారు ఆత్మీయంగా కలుసుకుని గొల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ గుర్తుగా జరుపుకున్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు గవర్నమెంట్ జూనియర్ కళాశాల 1973-1975ఇంటర్మీడియట్ బ్యాచ్ (గోల్డెన్ జూబ్లీ /50 సంవత్సరాలు) పూర్వవిద్యార్థులచే సమ్మేళనం 29-12-2024 ఆదివారము రోజున మల్లంపల్లిలోని సంపత్ రావు జామాయిల్ ఎస్టేట్ నందు మిత్రులు రామమూర్తి సమన్వయకర్తగా ఘనంగా నిర్వహించారు
ఈ సమ్మేళన కార్యక్రమంలో ఇంటర్ అన్ని గ్రూపులకు చెందిన సుమారు 23 మంది పూర్వ విద్యార్థులు పాల్గొనడం ఒకరినొకరు
పలకరించుకోవడం ఆనాటి మధుర స్మృతులను గుర్తు తెచ్చుకోవడం ఒక గొప్ప విశేషం.ఇటీవల భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ & కొందరి కుటుంబ పెద్దల మరణం పట్ల మిత్రులు రామ్మూర్తి సంతాపాన్ని ప్రవేశపెట్టి సామూహికంగా వారి ఆత్మల శాంతి కొరకు 2 నిమిషాలు మౌనం వహిస్తూ భగవంతున్ని ప్రార్థించారు.2024 సంవత్సరంకు వీడ్కోలు పలుకుతూ2025 సంవత్సరంకు స్వాగతం తెలుపుతూ ఒకరినొకరు ఆనందభరితంగా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోవడం ఒక ప్రత్యేకతను చాటుకున్నది.వివిధ రకాల వంటలతో భోజనాలు- పానీయములు ఏర్పాటుచేసిన . రజనీకర్ రెడ్డి కి సామూహికంగా ప్రత్యేకమైన ధన్యవాదములు తెలిపారు.అన్నదాత రజనీకర్ రెడ్డి సుఖీభవ.రుచి శుచి కరమైన వంటలు తయారు చేయించడంలో ముఖ్యపాత్ర వహించిన మిత్రులు సహదేవ్ రామస్వామిలు ఇతరులకుప్రత్యేకఅభినందనలు తెలిపారు.వేదికను ఏర్పాటు చేయుటకు కావలసిన సదుపాయములు పొందపరిచిన మిత్రులు సంపత్ రావు కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలపడం అయినది.ఈ సమ్మేళన కార్యక్రమంలో దూర ప్రాంతాల నుండి ( హైదరాబాద్ వరంగల్ హనుమకొండ, ములుగు బీరెల్లి ఇతర ప్రాంతాలు ) 1) రామమూర్తి, రిటైర్డ్ హెడ్మాస్టర్, ములుగు.
2) సంపత్ రావు,కాంట్రాక్టర్ హనుమకొండ
3) రజనీకర్ రెడ్డి రియల్ ఎస్టేట్ హైదరాబాద్
4) ఎస్ సాంబయ్య ప్రొఫెసర్(Retd.)హైదరాబాద్
5) మలహల్రావు ఇంటర్ ఆర్ జె డి(Retd) హైదరాబాద్.
6) కే.దేవేందర్ హెడ్మాస్టర్ (Retd.)హనుమకొండ.
7) శేఖర్ హెడ్మాస్టర్(Retd.) హనుమకొండ
8) తోట పూర్ణయ్య హెడ్మాస్టర్(Retd.) హనుమకొండ
9) డి ప్రభాకర్ రావు బిజినెస్ హైదరాబాద్
) భోగేశ్వర రావు బిజినెస్ వరంగల్
10) రామ్ గోపాల్ రావు బిజినెస్ వరంగల్.
11) షరీఫ్ టీచర్ రిటైర్డ్ వరంగల్
12) రమేష్ టీచర్ రిటైర్డ్ హనుమకొండ
13) నరసింహారెడ్డి PET (Retd.) హనుమకొండ
14) హరినాథ్ మాజీ సర్పంచ్( ములుగు)
15) సహదేవ్ క్లర్క్ (Retd) ములుగు
16) రామస్వామి టీచర్ రిటైర్డ్ ములుగు
17) విద్యాసాగర్ రెడ్డి ఇంచర్ల (Agri.)
18) ఆనంద దాస్ NFE సూపర్వైజర్ రిటైర్డ్ వరంగల్
19) జగదీశ్వర్ టీచర్(Retd) వరంగల్
20) ప్రభాకర్ బుద్ధారం(Agri.)
21) ముంతాజ్ బీరెల్లి (Agri)
22) పూర్ణచందర్ రిటైర్డ్ ఉద్యోగి హైదరాబాద్.
23). మహమ్మద్ లాయక్ అలీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రిటైర్డ్ వరంగల్ పాల్గొన్నారు
