తెలంగాణ న్యాయశాఖ మంత్రిత్వ శాఖ మరియు సబార్డినేట్ సర్వీస్ కోసం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1673 పోస్టుల కోసం తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ III, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, కంప్యూటర్ అపరేటర్, సిస్టమ్ అనలిస్ట్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 1673, వాటిలో 1277 టెక్నికల్, 184 నాన్-టెక్నికల్ , తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్ కింద 212 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు పేరు – ఖాళీలు
తెలంగాణ హైకోర్టు పరిధిలో
1. కోర్టు మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటేరియస్: 12
2. కంప్యూటర్ అపరేటర్: 11
3. అసిస్టెంట్: 42
4. ఎగ్జామినర్: 24
6. టైపిస్ట్: 12
7. కాపిస్ట్: 16
8. సిస్టమ్ అనలిస్ట్: 20
9. ఆఫీస్ సబార్డినేట్ : 75
మొత్తం పోస్టుల సంఖ్య: 212
తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్ పరిధిలో
☞ నాన్ – టెక్నికల్: 1277
☞ టెక్నికల్: 184
మొత్తం పోస్టుల సంఖ్య: 1461
మొత్తం ఖాళీలు: 1673
అర్హత: పదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 – 34 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; పీడీబ్ల్యూడీ (జనరల్/ ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.600; ఎస్టీ/ ఎస్సీ/ ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్ల్యూబీడీఎస్ అభ్యర్థులకు రూ.400.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, మెరిట్ లిస్ట్, స్కిల్ టెస్ట్, షార్ట్ హ్యాండ్ ఇంగ్లిష్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08-01-2025
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31-01-2025
పరీక్ష తేదీలు: టెక్నికల్ పోస్టులకు ఏప్రిల్, నాన్ టెక్నికల్ పోస్టులకు జూన్ 2025 నిర్వహించనున్నారు