జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని గొర్రెకుంట, మొగిలిచర్ల, గీసుకొండ, మచ్చాపూర్,కొమ్మల గ్రామాల్లో ఉన్న ఎరువులు షాపులను వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారిని అనురాధ బుధవారం నాడు తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఊకల్ సొసైటీ వద్ద రైతులను ఉద్దేశించి మాట్లాడుతూఅవసరాన్ని బట్టి మండలంలో ఉన్న సొసైటీలకు మార్క్ ఫెడ్ ద్వారా యూరియా, ఇతర ఎరువులను ఎప్పటికప్పుడు పంపించడం జరుగుతుందని చెప్పారు. జిల్లాలో సాగులో ఉన్న పంటలకు సరిపడా ఎరువుల నిలువలు జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని చెబుతూ ఎరువుల వినియోగంలో రైతులు పాటించాల్సిన సూచనలను తెలియజేయడం జరిగింది.
- నత్రజని ఎరువులను ( యూరియా) అవసరానికి మించి వాడకూడదు.
- పంటకు అవసరాన్ని మించి యూరియాని ఇవ్వడం ద్వారా పచ్చగా ఎదిగి చీడపీడలు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది.
- ఈ విధంగా పురుగుమందుల వినియోగం పెరిగి రైతులకు నికర ఆదాయం తగ్గిపోతుంది.
- మరోవైపు ఒక్కొక్క యూరియా బస్తా పై కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయల వరకు ప్రైవేట్ కంపెనీలకు సబ్సిడీ రూపంలో చెల్లిస్తుంది. రైతులు అనవసరంగా ఎక్కువగా యూరియా వాడడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వ్యవసాయ అధికారులు సూచించిన మోతాదులో పంటకు అవసరమైన ఎరువులను వాడాలని సూచించారు.అదేవిధంగా సొసైటీల వద్ద అమ్మకాలు సక్రమంగా జరపాలని, ఏ విధమైన అవకతవకలకు పాల్పడిన, రైతు అవసరానికి మించి ఓకే వ్యక్తికి ఎక్కువ బస్తాలు అమ్మిన లైసెన్స్ సస్పెండ్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆధార్ కార్డు వినియోగించి ఈ పాస్ మిషన్ ద్వారా మాత్రమే అమ్మకాలు జరపాలన్నారు. ఈ పాస్ మిషన్ తో పాటు మాన్యువల్ బిల్లును కూడా ఇవ్వాలన్నారు. ఎరువుల స్టాక్ వచ్చిన వెంటనే మండల వ్యవసాయ అధికారికి సమాచారం ఇవ్వాలని, వచ్చిన ఎరువులు ఎక్కువ మంది రైతులకు వచ్చే విధంగా పంపిణీ చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంట మండల వ్యవసాయ అధికారి పి.హరి ప్రసాద్ బాబు , NFSM కన్సల్టెంట్ సారంగం ఊకల్ సొసైటీ చైర్మన్ రమేష్ , సీఈఓ రమేష్ వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.