Jaibharathvoice.com | Telugu News App In Telangana
కర్నూలు

పండుగలు సామాజిక బాధ్యతను గుర్తుచేసి, పురోభివృద్ధికి దోహదపడుతాయి

జై భారత్ వాయిస్ న్యూస్ కర్నూలు
పండుగలు సామాజిక బాధ్యతను గుర్తుచేసి, పురోభివృద్ధికి దోహదపడతాయి, పండుగల వెనుక ఉన్న పరమార్థాన్ని తెలుసుకోవాలని , అప్పుడే భారతీయ సంస్కృతియొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా, జూపాడుబంగ్లా మండలం, పారుమంచాల గ్రామంలోని శ్రీ రామాలయం నందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోపూజ,కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వారు ప్రవచించారు. మూడు రోజులపాటు శ్రీమద్రామాయణం మహాభారతం భగవద్గీతలపై తితిదే ధర్మాచార్యులు ఆమంచి వేంకటేశ్వర్లు చేసిన ధార్మిక ప్రవచనాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో శ్రీ రామాలయం కమిటీ అధ్యక్షులు లోకేశ్వరరెడ్డి, భజన మండలి అధ్యక్షులు మండ్ల రాముడు, ధర్మ ప్రచార మండలి సభ్యులు పి.రామచంద్రుడు,శివశంకర్ రెడ్డి, భజన మండలి సభ్యులు పి.శివారెడ్డి, పాపయ్యాచారి, ఎస్.వెంకటస్వామి, జనార్ధనరెడ్డి, డోలక్ మాష్టరు డి.బాబు, ఎన్.ఆంజనేయులు, ఒ.వెంకటరమణ, తెలుగు వెంకటేశ్వర్లు, సి.రాము, సి.శేఖర్, ఎం.పవన్ కుమార్, జి.పుల్లయ్య, కె.మహేశ్, తోట రమేశ్, సురేందర్ రెడ్డి, శివ, పి.చిన్న స్వాములుతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Related posts

నేతాజి సుభాష్ చంద్రబోస్ సేవలు చిరస్మరణీయం డోన్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి