విశ్రాంత ఉపాధ్యాయ బృందం ఆత్మీయ కలయిక నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది మంచిర్యాల జిల్లాలోని కళ్యాణిఖని సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాల ఆల్ రిటైర్డ్ స్టాఫ్ మీట్ అండ్ గ్రీట్/ ఆత్మీయ అపూర్వ కలయిక.
హైదరాబాద్- ఈ సి ఐ ఎల్ లోని కమలానగర్ సీనియర్ సిటిజెన్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో కళ్యాణిఖని ఉన్నత పాఠశాల రిటైర్డ్ ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది ఆత్మీయ సమ్మేళన కార్యక్రమము జనవరి 19న ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా కార్యక్రమం కొనసాగింది.1975-76 నుండి 2024 వరకు పనిచేసి రిటైర్డ్ అయినా 53 మంది ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ప్రార్థన గీతంతో ప్రారంభమైపాల్గొన్న సిబ్బందిచే కళ్యాణిఖని పాఠశాల నందు పనిచేసిన కాలంలోని మధుర స్మృతులను అనుభూతులను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఈ ఆత్మీయ పలకరింపులతో మరువలేని సంతోషాన్ని పొందామని తెలుపుతూ ఉపన్యసించినారు.ఈ సందర్భంగా కే.వీ.ఎస్ ఎన్ మూర్తి సీనియర్ రిటైర్డ్ హెడ్మాస్టర్, పి.వి.ఈ. వరప్రసాద్ రిటైర్డ్ హెడ్మాస్టర్, ఎం నాగభూషణం రిటైర్డ్ హెడ్మాస్టర్, ఎన్ ఆర్ కే మూర్తి రిటైర్డ్ హెడ్మాస్టర్ , వీరభద్ర రావు రిటైర్డ్ హెడ్మాస్టర్, డి.పరండ్కర్ రిటైర్డ్ హెడ్మాస్టర్, కూరోజు దేవేందర్ రిటైర్డ్ హెడ్మాస్టర్,వి రాజమౌళి రిటైర్డ్ హెడ్మాస్టర్, టి. వెంకటేశ్వర్లు రిటైర్డ్ హెడ్మాస్టర్, శేషారత్నం రిటైర్డ్ హెడ్మాస్టర్, విజయభారతి రిటైర్డ్ హేడ్మాస్టర్ డి వెంకటేశ్వర్లు రిటైర్డ్ హెడ్మాస్టర్, సీనియర్ రిటైర్డ్ ఉపాధ్యాయులు డాక్టర్ టి భీమారావు, సీనియర్ లెక్చరర్ మరియు సాహితీ విద్యాసంస్థల అధినేత ఎం.సీ. నాగిరెడ్డిలు మిగతా సిబ్బంది అందరూ మాట్లాడుతూ ఈ కలయిక ఎంతో ఆత్మీయ పలకరింపులతో ఆనందాన్ని అనుభూతిని పొందామని, ప్రతి సంవత్సరంకు ఒకసారి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మంచిదని తెలిపినారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరిని గ్రూప్ ఫోటో మెమొంటోలతో కార్యనిర్వాహక కమిటీ సన్మానించారు. మెమొంటో దాత ఎం.సీ నాగిరెడ్డి ని శాలువాతో మెమొంటోలతో ఘనంగా సన్మానించారు.

కమలా నగర్ సీనియర్ సిటిజెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్లారెడ్డిని ప్రధాన కార్యదర్శి నారాయణని శాలువా మెమొంటోలతో ఘనంగా సన్మానించినారు.ఈ కార్యక్రమంలో యాంకర్ గా వ్యవహరించిన జే .వీ కృష్ణారావుని పలువురు వక్తలు ప్రశంసించారు. నిర్వాహక కమిటీ సభ్యులలోని ముఖ్యులు ఎస్ ఎస్ వి ప్రసాద్ రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్, పానుగంటి శ్రీనివాస్ రెడ్డి రిటైర్డ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, జే.వీ కృష్ణారావు రిటైర్డ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఎంతో ప్రయాసలతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని విజయవంతము గావించినారని పలువురు వక్తలు పొగడ్తలతో ముంచినారు. వచ్చిన సిబ్బందికి రుచి శుచి కరమైన టిఫిన్, భోజనాలు, టి అండ్ స్నాక్స్ మరియు వడ్డించడంలో పూర్వ సింగరేణి విద్యార్థులు బీరం రవి, ప్రొఫెసర్ తిరుమల, భాస్కర్, రాజమౌళి, కే. శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ దాస్ మరియు తదితరులు చక్కటి సేవలను అందించినందులకు అభినందించడం అయినది.చివరిగా నిర్వాహక కమిటీ సభ్యులైన పానుగంటి శ్రీనివాస్ రెడ్డి గారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మెమంటూ దాత నాగిరెడ్డి-నిర్మల దంపతులకు, కమలానగర్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్లారెడ్డి,నారాయణ గార్లకు హృదయపూర్వక వందన సమర్పణ చేసినారు.చివరగా రిటైర్డ్ మ్యూజిక్ టీచర్ మంగతయారుతో జాతీయ గీతాన్ని సామూహికంగా ఆలపించారు