April 9, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఆర్ధిక సహాయం అందజేత

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
  గీసుకొండ మండల కేంద్రానికి చెందిన సుంకరి నర్సిరెడ్డి అనే నిరుపేద వ్యక్తి ఇటీవల అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్  పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ఐదు వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు. అదేవిధంగా అమెరికాలో సైంటిస్ట్ గా పనిచేస్తున్న డాక్టర్| పసునూటి కళ్యాణ్  పంపిన ఐదు వేల రూపాయల ఆర్థికసహాయాన్ని కళ్యాణ్ తరపున వీరగొని అనిల్ మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈకార్యక్రమంలో వీరితోపాటు స్థానికులు రామా కుమారస్వామి, ముల్క సత్యనారాయణ, యాదగిరి లక్ష్మణ్ గురుస్వామి తదితరులు  పాల్గొన్నారు.

Related posts

టీచర్ల సమస్యల పరిష్కారంలో పీ ఆర్టీ యు ముందు ఉంటుంది

వాగులో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన తాసిల్దార్ సిబ్బంది

ప్రజా పాలన ధరఖాస్తుల కంప్యూటరీకరణ జడ్పీ సిఈఒ పరిశీలన.