(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు ):
ఏపుగా పెరిగిన జామాయిల్ తోటలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్
తోట మొత్తం దగ్ధమైన సంఘటన శాయంపేట మండలం పత్తిపాక శివారులో చోటుచేసుకుంది. బుధవారం అందిన వివరాల ప్రకారం ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన బూర పద్మ, బూర రమేష్ చెందిన మూడు ఎకరాల వ్యవసాయ భూమిలో జామాయిల్ తోట సాగు చేస్తున్నారు. బుధవారం విద్యుత్ తీగలు తగిలి షార్ట్ సర్క్యూట్ తో జామాయిల్ తోట మొత్తం దగ్ధమైంది. చేతికి వచ్చిన పంట దాదాపు 5 లక్షల పైన విలువ చేసే కర్ర అగ్నికి ఆహుతైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు

previous post