Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టిఎన్జీఓస్-రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్

జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం )
టీఎన్జీఓస్.  వరంగల్ జిల్లా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్  టీఎన్జీఓ భవన్ నందు జిల్లా అధ్యక్షులు గజ్జెలు రామ్ కిషన్ అధ్యక్షతన జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్,ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేని పాల్గొని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ  ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తుందని , ఉద్యోగుల పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారమైతాయని అలాగే టిఎన్జిఓ సంఘం 80 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఉద్యోగుల మహాసభను హైదరాబాద్ లో నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. ప్రధాన కార్యదర్శి ముజీబ్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ఉద్యోగులు తమ వంతు బాధ్యతగా పనిచేస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరే విదంగా పనిచేయాలని, ఉద్యోగుల హక్కుల కోసం పోరాడడంలో, సమస్యలకు పరిష్కారం చూపడంలో ముందు వరుస లో ఉండే ఏకైక సంఘం మనది అని వారన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రాం కిషన్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ ల ద్వారానే పరిష్కారం అవుతాయని, డైరీ ఆవిష్కరణ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గాజే వేణుగోపాల్,రాష్ట్ర కార్యదర్శి వేముల వెంకటేశ్వర్లు,జిల్లా సహాధ్యక్షులు లావుడియా హేమా నాయక్, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు దుర్గారావు, గద్దల రాజు, వెలిశాల రాజు, ఇంద్రసేనారెడ్డి, సిటీ అధ్యక్షులు శంకేశి రాజేష్, జిల్లా సహాయ కార్యదర్శి రజనీకాంత్ ,రామకృష్ణ,రఘు, గణేష్ ,చిరంజీవి , సతీష్, అర్జున్, మెడికల్ ఫోరం అధ్యక్షులు మాడిశేట్టి శ్రీనివాస్ ,హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు రవికుమార్ ,జోసఫ్, పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్ష లు యాకుబ్ నాయక్, రాజు, అశోక్ , కో-ఆపరేటివ్ ఫోరం అధ్యక్షులు మనోహర్, వరంగల్ రూరల్  అధ్యక్షులు ఆనందరావు, సంగెం యూనిట్ అధ్యక్షులు కిరణ్ కుమార్, వర్ధన్నపేట యూనిట్ అధ్యక్షులు దేవేందర్, నెక్కొండ యూనిట్ అధ్యక్షులు శ్యాంసుందర్, రవీందర్, వంశి తదితరులు పాల్గొన్నారు.

Related posts

అమెరికా పర్యటనకు వెళుతున్న  సామాజిక వేత్త  పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ-గీతమ్మ దంపతులకు ఆత్మీయ వీడ్కోలు

MISS WORLD-2025 ప్రపంచ సుందరి 2025 పోటీకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి .ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

బిజెపి అంటే కొత్త అర్థం చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి