Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన ప్రారంభం.

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన ప్రారంభం.విద్యాశాఖను బలోపేతం, నూతన విద్యా విధానం, తదితర అంశాలపై రాష్ట్ర విద్యా శాఖ సెక్రటరీ Dr.యెగితారాణా, కమిషనర్ Sri EV నర్సింహారెడ్డి,లు హైద్రాబాద్ నుండి గురువారం రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లు, విద్యా శాఖ అధికారులు, ప్రోగ్రాం, క్వాలిటీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా యెగితా రాణా మాట్లాడుతూ SCERT తెలంగాణ ఆద్వర్యంలో సమగ్ర శిక్ష తెలంగాణ విద్యాశాఖ మౌళిక భాషాగణిత సామర్థ్యాల సాధన కార్యక్రమంలో (FLN) లో కృత్రిమ మేథను ఉపయోగించి బోధన ను మెరుగుపరచడానికి axl , Ekstep ఫౌండేషన్ సహకారంతో మొదటి దశలో పైలెట్ ప్రాజెక్టు గా 6 జిల్లాల్లో ప్రారంభించిందని ,ఆయా జిల్లాలలో మెరుగైన ఫలితాలు ఉన్నందున రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాలలో కూడా ఈనెల 15 వ తారీకున ప్రారంభించాలని, సంకల్పించమని ,
ప్రతి జిల్లా నుండి ఒక క్వాలిటీ కోఆర్డినేటర్, ఒక మండల విద్యాశాఖాధికారి , ఒక పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు మరియు ఒక ప్రాథమిక పాఠశాల ఉపాద్యాయుడు ఇలా ప్రతి జిల్లా నుండి నలుగురికి రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇచ్చిందన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఎంపిక కాబడిన 11 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు , ఉపాద్యాయులకు ,
ఆయా పాఠశాలలో ఉన్న కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, ఆయా మండలాల విద్యాశాఖాధికారులకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకరోజు ఓరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు.

మార్చి 15 న
ఎంపికైన 11 స్కూళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాసులు ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.జిల్లా లో ఎంపికైన 11 స్కూల్ చెన్నారావుపేట మండలం ఎంపీపీ ఎస్ లింగాపురం, ఎంపీపీ ఎస్ జల్లి, ఎంపీపీ ఎస్ పాపయ్యపేట, గీసుకొండ మండలం ఎంపీపీ ఎస్ మచ్చాపూర్, నర్సంపేట్ ఎంపీపీ ఎస్ మహేశ్వరం, పర్వతగిరి మండలం ఎంపీపీ ఎస్ గోపనపల్లి, రాయపర్తి మండలం ఎంపీపీ ఎస్ మైలారం, ఎంపీపీ ఎస్ కొలన్ పల్లి, ఎంపీపీ ఎస్ ఊకల్ ఎంపీపీ ఎస్ తిరుమలయపల్లె, ఎంపీపీ ఎస్ కాట్రేపల్లి లలో ప్రారంభించడం జరుగునని జిల్లా కలెక్టర్ అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి డిఆర్ఓ విజయలక్ష్మి డిఇఓ జ్ఞానేశ్వర్,సుజన్ తేజ క్వాలిటీ కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రజాస్వామ్య పరిరక్షణ కు ఓటే ఆయుధం: వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి

మోడల్ కూరగాయల మార్కెట్ గా తీర్చిదిద్దుతాం: మంత్రి కొండా సురేఖ

యుద్ధ ప్రతిపాదికన లీకేజీ మరమ్మత్తు  పూర్తి చేయండి: నగర మేయర్  గుండు సుధారాణి