Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

Erragattu gutta 14నుండి18వరక ఎర్రగట్టు గుట్ట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ )
కలియుగ దైవం  కోరిన కోరికలను నెరవేరుస్తూ ఆపద మొక్కుల వాడిగా, వెంకటేశ్వరుడిగా భక్తుల చేత పూజలు అందుకుంటున్నారు హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలంలో ఉన్న erragattu gutta ఎర్రగట్టు గుట్టలో స్వయంభుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 14 నుండి 18 వరకు అంగరంగ వైభంగా జరుగుతాయని ఆలయ అర్చకులు వేదాంతం పార్థసారథాచార్యులు తెలిపారు. ఈ దేవాలయంలో స్వామివారు శయన రూపంలో భక్తులకు దర్శనమిస్తారని దేశంలో చాలా అరుదుగా ఈ రూపంలో దర్శనం ఇస్తానని తెలిపారు స్వామి వారి బ్రహ్మోత్సవాలకు జిల్లా అధికార యంత్రంగం జాతరకు వచ్చె భక్తులకు అన్ని సౌకర్యలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
 మూడు వేల సంవత్సరాల క్రితం ఈ ఎర్రగట్టుగుట్టలో వెలిశారని చరిత్ర చెబుతుంది. పూర్వకాలంలో ఓ అర్చకులు నిద్రిస్తున్న సమయంలో ఆ వెంకటేశ్వరుడు తన కలలోకి వచ్చి ఈ గుట్టపై వెలిసినట్లు చెప్పారని, ఈ కొండ మధ్యలో ఎర్రటి రంగున్న గుట్టలో పగుళ్లు మధ్య పసుపుతో ఉన్న ఆ స్వామివారి పాదముద్రలను గుర్తించినట్లు అర్చకులు తెలిపారు. ఆనాటి నుంచి ఈ స్వామి వారు విశేష పూజలు అందుకుంటున్నారని అర్చకులు   తెలిపారు.14వ తేదీ రాత్రి 11:48 నిమిషములకు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందని తెలిపారు 15వ తేదీ నాడు బండ్లు తిరుగుట 16వ తేదీ నాడు కుంకుమార్చన హారతి ప్రసాద వినియోగము 17వ తేదీ క్షీరాభిషేకము అర్చనలు చేయడం జరుగుతుందని అన్నారు 18 వ తేదీ స్వామివారి ఉత్సవ మూర్తులు భీమారం హాసన్ పర్తి   దేవాలయాలకు వేంచేస్తారని తెలిపారు

Related posts

ప్రభుత్వ జిల్లావిద్యా శిక్షణ సంస్థలో గెస్ట్ లెక్చరర్ అధ్యాపకుల దరఖాస్తుకు ఆహ్వానం

దామెరలో పోలీస్ కవాతు

పెద్దమ్మగడ్డ దళితుల సమాదులను పరిరక్షించాలని పెద్దమ్మగడ్డ X రోడ్డు వద్ద ధర్నా చేస్తున్న దళితులకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

Sambasivarao