(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్, 14 మార్చి ) వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తన కుటుంబ సభ్యుల సమేతంగా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, పలు శాఖల జిల్లా అధికారులు, టి జి ఓ, టి ఎన్జి ఓస్, తదితర సంఘాలు, తోటి ఉద్యోగస్తులతో కలిసి శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో హోలీ వేడుకలను ఉత్సాహంగా ఘనంగా జరుపుకున్నారు. వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయినీ రాజేందర్ రెడ్డి,గ్రేటర్ వరంగల్ నగర మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, ఈ వి శ్రీనివాస్, నగర ప్రముఖులు కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో కలసి హోలీ వేడుకల్లో పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్య శారద హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సహజమైన రంగులను వినియోగించినందుకు అభినందించారు. హోలీ పండుగ ఐక్యతకు చిహ్నమని, జాతీయ సమైఖ్యతాభావంతో దేశంలో జరుపుకునే సంబరాల్లో హోలీ ఒకటని అన్నారు. తాను మొదటిసారి వరంగల్ లో హోలీ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. హోలీ పర్వదినం అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని ఆకాంక్షించారు.ఈ వేడుకలో కలెక్టర్ కూతురు శ్రీయాన్షి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీయాన్షి అందరికి కుంకుమ తిలకం పెట్టి రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలియజేయడం వేడుకలకు మరింత రంగులద్దింది.కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా అధికారులు, టీజీవో, టి ఎన్ జి ఓ స్ సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు హోలీ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొని, ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ పండుగను ఉల్లాసంగా జరుపుకున్నారు.జెడ్పి సీఈఓ రామీ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా మత్సశాఖ అధికారి నాగమణి, డిపిఆర్ ఓ ఆయూబ్ అలీ, టీజీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ. జగన్ మోహన్ రావు, రాష్ట్ర కార్యదర్శి కిరణ్మయి, వరంగల్ జిల్లా అధ్యక్షులు రామ్ రెడ్డి, కార్యదర్శి ఫణి కుమార్, ఎన్జి ఓస్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్, హేమ నాయక్, సదానందం, తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
