ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదవ తరగతి వార్షిక పరీక్షలను అధికారులు సమన్వయంతో పక్కడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. బుధవారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 పరీక్షలు నిర్వహిస్తారని, జిల్లాలో 49 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 49 పంది ముఖ్య పర్యవేక్షకులు 49 మంది శాఖ అధికారులు, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు , నలుగురు కస్టోడియన్లు 461 మంది ఇన్విజిలేటర్లను నియమించామని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, 144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలన్నారు. వేసవి దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, నిరంతర విద్యుత్ కల్పించడంతోపాటు ఏ ఎన్ ఎం ,ఫస్ట్ ఎయిడ్, ఓ ఆర్ ఎస్ తో అందుబాటులో ఉండాలని, ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన రూట్లలో ప్రశ్న, జవాబు పత్రాలు తరలింపు సమయంలో పోలీస్ అధికారులు తప్పనిసరిగా ఉండాలన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా చూడాలని అన్నారు. విద్యార్థులు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, డీఈఓ జ్ఞానేశ్వర్, జిల్లా పరీక్షల సహాయ కమిషనర్ కే అరుణ, డీఎంహెచ్ఓ డాక్టర్, ఆర్డీవోలు సత్యపాల్ రెడ్డి, ఉమారాణి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.