Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

వెంటిలేటరు మీద చికిత్స లో తెలంగాణ ఉద్యమకారుడు-ఆదుకోవాలని కుటుంబ సభ్యుల వినతి

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ) ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమంలో చురుకుగా పనిచేసిన కార్యకర్త నేడు రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాదులోని ఒక ఆసుపత్రిలో వెంటి లేటర్ పై చికిత్స పొందుతూ నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. వివరాలలోకి వెళితే ఆత్మకూరు మండలం నీరుకుల్ల గ్రామానికి చెందిన కాకాని శ్రీధర్ గత 25 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితిలో కార్యకర్తగా చేరి ప్రత్యేక తెలంగాణ కోసం పూర్తిస్థాయిలో కార్యకర్తగా పనిచేసి ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం చేపట్టిన ప్రతి ఆందోళన లో ముందు వుండే వారు. ఆ తర్వాత టిఆర్ఎస్ లో పూర్తిస్థాయి కార్యకర్తగా పనిచేయడంతో ఆత్మకూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్గా పనిచేశారు . ప్రస్తుతం పరకాల టీ ఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి గా పని చేస్తున్నారు. అయితే ఆత్మకూరు నుంచి బైకుపై నీరుకుల్ల గ్రామానికి వస్తుండగా నిరుకుల్ల క్రాస్ వద్ద ఎదురుగా వస్తున్న బైకు ఢీకొనడంతో తీవ్ర గాయాలు కావడంతో వరంగల్ ఆసుపత్రిలో చేర్పించారు . గాయాలు తీవ్రంగా కావడంతో ఇబ్బందిగా తయారైంది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. కాకాని శ్రీధర్ ను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరము శ్వాసకు ఇబ్బంది కావడంతో ఆ ఆస్పత్రి వర్గాలు హైదరాబాద్ కు తరలించాల ని సూచనలు చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం కాకాని శ్రీధర్ ను హైదరాబాదులోని యశోద ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో ప్రస్తుతము శ్వాసకు ఇబ్బంది కావడంతో వెంటలేటరుపై చికిత్స చేస్తున్నారని అతని భార్య స్వప్న తెలిపారు. ఆసుపత్రిలో చికిత్సకు దాదాపు రూ. 10 లక్షలు అవసరమవుతాయని తమకు ఆదుకోవాలని ఆమె అన్నారు. టిఆర్ఎస్ లో పూర్తిస్థాయిగా శ్రీధర్ పనిచేశారని ఆమె తెలిపారు. ప్రస్తుతము ఇల్లు గడవడమే కష్టంగా మారిందని రూ 10 లక్షలు చికిత్సకు ఎలా తేవాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిస్సహాయ స్థితిలో వున్న, తమ భర్త ఆసుపత్రిలో చికిత్సకు ఆర్థిక సాయం అందించాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ ,మాజీ ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు లను కోరారు. తమకు సాయం అందించే వారు
99663 28357ఫొన్ నెంబర్ కు ఫోన్ పే ద్వారా ఇతర రకాల ద్వారా సాయం అందించాలని కోరారు. తమను ఆదుకోవాలని టీఆర్ఎస్ నాయకులను కోరారు.

Related posts

సర్వే వివరాలను అత్యంత జాగ్రత్తగా నమోదు చేయాలి

ఆర్ట్స్ కళాశాలలో ఇఫ్తార్ విందు!

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.

Jaibharath News