Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

విద్యార్థుల ఫీజుల దుర్వినియోగంపై విచారణ చేపట్టండి

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
విద్యార్థుల ఫీజులు దుర్వినియోగం కావడంపై సమగ్ర విచారణ చేపట్టాలని రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్గనైజేషన్ వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు దూడం భాస్కర్, ప్రధాన కార్యదర్శి దామెరుప్పుల అశోక్ వరంగల్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు డిస్ట్రిక్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు (డిసిఇబి) ప్రైవేట్, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో నిర్వహించే పరీక్ష నిర్వహణకు కొంత నిధిని విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో సమకూరుస్తుందని తెలిపారు. టెన్త్ విద్యార్థుల ప్రత్యెక తరగతులకు కౌన్సెలింగ్ కు మాత్రమే వినియోగించాల్సి ఉండగా విద్యాశాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిధులు దారి మళ్లించి ఖర్చు పెట్టినట్లు డిఈఓ కార్యాలయం లో చర్చ జరిగినట్లు తెలిసిందన్నారు. డీసీఈబి కార్యదర్శి ని వివరణ అడిగే ప్రయత్నం చేయగా స్పందించ కపోవటం జిల్లా విద్యా శాఖ అధికారి నిధులను ఇతర అవసరాల కు ఖర్చు చేశామని చెప్పడం చర్చనీయాంశంగా మారిందన్నారు. ఈ విషయమై సోమవారం ప్రజావాణి లో వరంగల్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందచేసి డి సి ఇ బి నిధుల అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరినట్లు ఆర్గనైజేషన్ ఉపాధ్యక్షులు దూడం భాస్కర్, ప్రధాన కార్యదర్శి దామెరుప్పుల అశోక్ తెలిపారు.

Related posts

గీసుకొండలోఅటల్ బిహారీవాజ్ పాయ్ జయంతి వేడుకలు

ఘనంగా  ఉపాధ్యాయ దినోత్సవం

ఆర్ధిక సహాయాన్ని అందజేసిన కాంగ్రెస్ నాయకులు.