Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఆదిలాబాద్ జిల్లా

బాధిత కుటుంబానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తాం – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

(జై భారత్ వాయిస్ న్యూస్ అదిలాబాద్ ) గత సంవత్సరం తంసి పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తిస్తూ గుండెపోటుతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ ఎం గంగన్న కుటుంబానికి ప్రభుత్వపరంగా వచ్చే అన్ని సహాయ సహకారాలు సకాలంలో అందజేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సిబ్బందికి ఆదేశించారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ గంగన్న భార్య ఎం ప్రమీలకు మంగళవారం నాడు భద్రత నుండి వచ్చిన 8 లక్షల రూపాయల చెక్కును జిల్లా ఎస్పీ అందజేయడం జరిగింది. బాధిత కుటుంబానికి ఎలాంటి సహాయ సహకారాలైన జిల్లా పోలీస్ యంత్రాంగానికి సంప్రదించాలని ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆరోగ్యం కాపాడుకుంటూ కుటుంబ సభ్యులతో శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని తెలియజేసిన జిల్లా ఎస్పీ. ఈ కార్యక్రమంలో ఏఓ భక్త ప్రహల్లాద, సీసీ దుర్గం శ్రీనివాస్, సూపరిండెంట్ గంగాధర్, ప్రెసిడెంట్ పెంచాల వెంకటేశ్వర్లు, జైస్వాల్ కవిత పాల్గొన్నారు.

Related posts

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు..

Jaibharath News

కేంద్ర బృందంను కలిసిన జిల్లా అధికారి

సూర్యుడి రహస్యం ఆదిత్య ఎల్ Aditya-1 వన్ ప్రయోగం

Jaibharath News