Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

రైతులు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య*

రైతులు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని శాసన  మండలి సభ్యులు బసవరాజు సారయ్య అన్నారు.మంగళవారం వరంగల్ జిల్లా నగర 43 వ డివిజన్ రంగశాయిపేటలో మూడు రోజుల పాటు నిర్వహిస్తూన్న రాష్ట్ర స్థాయి  రైతు ఉత్పత్తిదారుల సంఘాల మేళాను ను ఎమ్మెల్సీ , రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఛైర్మెన్ జంగా రాఘవరెడ్డి జిల్లా కలెక్టర్ డా.సత్య శారద, కుడా ఛైర్మెన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి లతో కలిసి ముఖ్య అతిథి గా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన సమావేశం లో ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు పక్షపాతి అని, ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు ఏకకాలంలో  రుణమాఫీ చేసిన ఘనత సి ఏం కు దక్కుతుందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం లో రైతులు, మహిళలు, కార్మికులకు సంక్షేమ ఫలాలు దక్కుతున్నవని అన్నారు.  కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల నుండి వివిధ పథకాల ద్వారా ఆర్థికంగా బ్యాంకు లింకేజీలు, రైతులు తక్కువ పెట్టుబడితో వినూత్నమైన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి అధిక రాబడి పొందే విధంగా  నిష్ణాతులైన శాస్త్రవేత్తలు సాంకేతిక పరిజ్ఞానం ఈ మేళా లో అందిస్తారని, దేశంలోని చిన్న సన్నకారు రైతుల భేరసారాల శక్తిని మార్కెట్ లింకేజీని పెంచి వారిలో సాధికారత కల్పించడమే లక్ష్యంగా  రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఏర్పాటుచేసి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం అందించి వివిధ వినూత్న వ్యవసాయ పద్ధతులను ప్రదర్శించడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ఎఫ్ పి ఓల వృద్ధి, అభివృద్ధిని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని, నిష్ణాతులైన శాస్త్రవేత్తలు సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయ పద్ధతులపై  వివరిస్తారని తెలిపారు.రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఛైర్మెన్ జంగా రాఫవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా కలెక్టర్ ల సహకారం తో రాష్ట్ర స్థాయి మేళా ను ఏర్పాటు చేయడం అభినందనీయం అని, పండించిన పంటకు గిట్టుబాటు అందించే విధంగా వివిధ వ్యవసాయ సంఘాలను ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేసే విధంగా రైతును బలోపేతం చేయడానికి గిట్టుబాటు ధర లభించక నష్టపోతున్నారని, నకిలీ విత్తనాల వల్ల మోసపోతున్నారని, ఇలా జరగకుండా రైతులను చైతన్యం చేయడానికి మేళా ను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పది మంది తో సుమారు రాష్ట్ర వ్యాప్తం గా 10 వేల గ్రూపు లను ఏర్పాటు చేసి రైతులకు లాభం చేకూరే విధంగా కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుందని, రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించి ఆర్ధిక పురోభివృద్ధి సాధించాలని అన్నారు.
వ్యవసాయ శాఖ అధికారులు వివిధ పంటలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని రైతు లకు అందించాలని రాష్ట్రం లో దేశం లో  ఆయిల్ పామ్ పంట సాగు తక్కువ విస్తీర్ణం లో  సాగు అవుతుందని ఆయిల్ సాగును ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం  రూ.375 కోట్లను కేటాయించిందని, ఈ పంట సాగు చేయడానికి నీటి వినియోగం ఎక్కువ అనే అపోహను రైతులు వీడనాడాలని అన్నారు. వరి పంటకు వాడే నీటి లో మూడవ వంతు నీటి ద్వారా ఆయిల్ ఫామ్ పంటను సాగు చేయవచ్చునని తెలిపారు.వరంగల్. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ* రైతులకు లాభసాటిగా మారడంలో ఎఫ్​ పీ ఓ ల పాత్ర కీలకమని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా  వరంగల్ జిల్లాలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న రైతు ఉత్పత్తిదారుల సంఘాల మేళను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మేళలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి సుమారు 40 ఉత్పత్తిదారుల సంఘాల యొక్క ఉత్పత్తులకు సంబంధించిన స్టాల్స్, అమ్మకం నిర్వహించడం జరుగుతున్నదని అన్నారు.చిన్న మరియు సన్నకారు రైతులు వనరులను సమష్టిగా యాక్సెస్   చేసి వారి ఉత్పత్తులను,  మార్కెట్ సంబంధాలను మెరుగుపరిచి ఆదాయం పెంచడమే  ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యమని అన్నారు.జిల్లా యంత్రాంగం రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అవసరమైన అనుమతులు, సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులకు తెలియజేసి, జిల్లాలో పెద్దఎత్తున రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఆర్థికాభివృద్ధికి చిన్న తరహా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు ను ప్రోత్సహించాలని కలెక్టర్ తెలిపారు.
ఫార్మర్ ప్రొడ్యుసర్ ఆర్గనైజేషన్ లను బలోపేతం చేయడానికి  తోడ్పడుతుందని.రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు అధిక లాభాలు వచ్చే విధంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కృషి చేయాలన్నారు. దళారీ వ్యవస్థ ద్వారా రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎఫ్ పి ఓ వల్ల రైతులు సమష్టి బలం ఇన్పుట్స్  ఉత్పాదకములు పొందవచ్చని అన్నారు.సాంకేతిక  శిక్షణ, మరియు రైతుల ఉత్పత్తులను సమష్టిగా మార్కెటింగ్,  ప్రాసెసింగ్ ప్యాకేజింగ్ చేయడానికి సహాయపడుతుందని తెలిపారు.రైతులు  (ఎఫ్  పి ఓ)  రైతు ఉత్పత్తిదారుల సంస్థలపై పూర్తి అవగాహన కలిగి ఉండి వాటి ప్రయోజనాలు పొందాలని అన్నారు.మన రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి సుమారు 40 ఎఫ్ పి ఓ లు పాల్గొని తమ ఉత్పత్తులను విక్రయిస్తూన్నారని.   దాదాపుగా 1000 మంది రైతులు ఈ మేళాను సందర్శించే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ* జిల్లాలోని రైతులు ఉత్పత్తి చేసిన గృహ, వంటగది అవసరాలు, ఆరోగ్యకర అల్పాహారాలు, అందం, ఆరోగ్య సంరక్షణ తదితర సహజ సిద్దమైన మేలైన ఉత్పత్తులను ఆసక్తి వున్న ప్రజలు కొనుగోలు చేయుటకు, రైతు యొక్క ఉత్పాదకతను పెంచటానికి, ఉత్పత్తులకు మార్కెట్ అనుసంధానాల ద్వారా అధిక రాబడి మరియు ఆదాయమును పెంపొందించుటకు కొత్త FPO లు ఏర్పడిన సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల వరకు FPOల నిర్వహణ, ఉత్పత్తి ప్రాసెసింగ్, విలువ, మార్కెట్ లింకేజీలు మరియు సాంకేతిక పరిజ్ఞానం వినియోగం మొదలైన అంశాలలో మద్దతు అందిస్తామని అన్నారు. ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన  50 వ్యవసాయ సంబంధిత పనిముట్లు, యంత్రాలు, ఉత్పత్తుల స్టాళ్లను అతిథులు సందర్శించి యంత్రాల పనితీరు, ఉపయోగాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారుఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఏ సి డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ రామన్సింగ్ అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి పి జె టి ఏ యు డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి, అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ సుజాత, వ్యవసాయ అధికారి అనురాధ డి ఆర్ డి ఓ కౌసల్యాదేవి, రెడ్ పి సి ఓ రామ్ రెడ్డి, జిల్లా ఉద్యానవనాల ఆధికారి సంగీతలక్ష్మి, మార్కెటింగ్ అధికారి సురేఖ,  స్థానిక కార్పొరేటర్ ఎదూరి అరుణ విక్టర్, 33 జిల్లాల రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పోచమ్మ తల్లికి బిజెపి నాయకుల పూజలు

నాటు సారా పట్టుకున్న జక్కాల పరమేష్

Jaibharath News

కామారెడ్డి డిక్లరేషన్ తక్షణం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలి ప్రజా సంఘాల డిమాండ్