Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

అమెరికా పర్యటనకు వెళుతున్న  సామాజిక వేత్త  పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ-గీతమ్మ దంపతులకు ఆత్మీయ వీడ్కోలు

జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం
అమెరికా పర్యటనకు వెళుతున్న  సామాజిక వేత్త గీసుకొండ గ్రామానికి చెందిన పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ-గీతమ్మ దంపతులకు ఆత్మీయ వీడ్కోలు పలికారు గ్రామస్తులు
గీసుకొండ గ్రామాభివృద్ధి కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి పలు అభివృద్ధి పనులు పూర్తి చేసి గీసుకొండ గ్రామ శ్రీమంతుడుగా గుర్తింపు పొందిన రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ-గీతమ్మ దంపతులు, అమెరికా పర్యటనకు వెళుతున్న సందర్భంగా గీసుకొండ గ్రామానికి చెందిన పలువురు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు పలికారు.ఈకార్యక్రమంలో గీసుకొండ తాజా మాజీ సర్పంచ్ దౌడు బాబు, గీసుకొండ సోషల్ సర్వీస్ టీం సభ్యులు కర్ణకంటి రాంమూర్తి, ముల్క సత్యనారాయణ, కత్తి వెంకటేశ్వర్లు, పసుల రాజేందర్, సంపత్ మరియు కురిమిళ్ల వేణు తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ భవన్ లో స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘనంగా నివాళులు ఎంపి రవిచంద్ర

అభినవ నేతాజీకి  రాష్ట్ర స్థాయి యోగా పోటీలో బ్రాంజ్ మెడల్

టీఎన్జీఓస్ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మారం జగదీశ్వర్ కు అభినందనలు