Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

కోనాయమాకుల లిఫ్ట్ ఇరిగేషన్ కు పెండింగ్ నిధులు కేటాయించి, ప్రారంభించాలి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

గీసుకొండ మండలం కొనాయమాకుల లిఫ్ట్ ఇరిగేషన్ కు పెండింగ్ నిధులను మంజూరు చేయాలని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. గురువారం నాడు అసెంబ్లీలో ఎంఎల్ఏ మాట్లాడుతూ స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 2007 లో శంకుస్థాపన చేశారని,లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఇప్పటికే 95 శాతం వరకు పూర్తయ్యాయని అన్నారు. సబ్ స్టేషన్ నిర్మాణ పనులు పెండింగ్లో ఉందని అన్నారు.లిఫ్ట్ ఇరిగేషన్ ను మే నెలలో ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని,రాష్ట్ర ప్రభుత్వం సాగు, తాగునీటిరంగాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని కోరారు

Related posts

ముఖ్యమంత్రిని కలిసిన ఐజేయూ, టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత సిఎం రేవంత్ రెడ్డి

ఎ. జ్యోతి

అటవీ సంరక్షణలో ఫారెస్ట్ పోలీసుల పాత్రే కీలకమైనది.