వరంగల్ జిల్లా గ్రామిణాబి వృద్ది సంస్థ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలోదివ్యాంగులకు యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ (యూడీఐడీ) కార్డులు – అవగాహన సదస్సు శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి టి ఆర్ డి ఓ పి డి కౌసల్యాదేవి జెడ్పిసిఓ రాంరెడ్డి డిపిఓ కల్పన గార్లు పాల్గొని యు డి ఐ డి మీద పవర్ ప్రెసెంటేషన్ ద్వారా దివ్యాంగులకు అవగాహన కల్పించారు.ఈ సదస్సులో దివ్యాంగుల గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ (యూడీఐడీ) కార్డులను జారీ చేస్తోందని. ఈ కార్డులు ఉన్న వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఈ సదస్సులో డి ఆర్ డి ఓ పి డి కౌశల్య దేవి మాట్లాడుతూరాష్ట్ర స్థాయిలో ఇప్పటికే సదరం సర్టిఫికెట్ తీసుకున్న వారికి యూడీఐడీ కార్డులను ఆటోమేటిక్ గా జనరేట్ చేసి వారి ఇంటికి పంపిస్తారని వారు పేర్కొన్నారు.కొత్తగా సర్టిఫికెట్ కావాల్సిన వారు, సదరం సర్టిఫికెట్ గడువు ముగిసి రెన్యూవల్ చేసుకోవాల్సిన వారు మాత్రం కార్డు కోసం అప్లై చేసుకోవాలని వారు అన్నారు. ఈ యూడీఐడీ కార్డ్ వల్ల దివ్యాంగులకు మరింత ప్రయోజనం కలుగుతుందని ,ఆన్లైన్లో అప్లికేషన్ యూడీఐడీ కార్డు కోసం దివ్యాంగులు www.swavlambancard.gov.in వెబ్సైట్లో నేరుగా గానీ, మీ – సేవ ద్వారా గానీ అప్లై చేసుకోవాలని సూచించారు. గతంలో మాదిరిగానే జిల్లా హాస్పిటల్లో నిర్వహించే మెడికల్ క్యాంపు నకు వారికి నిర్ధారించిన తేదిలో తప్పకుండ హాజరు కావాలని, అక్కడ వారికి స్లాట్ కేటాయించి మెడికల్ క్యాంప్ ఎప్పుడు ఉంటుందనేది ఫోన్ ద్వారా తెలియజేస్తారని పేర్కొన్నారు. వారు చెప్పిన రోజున క్యాంపు నకు హాజరైతే సంబంధిత డాక్టర్లు వారికి వైద్యపరీక్షలు నిర్వహించి వైకల్యం శాతాన్ని నిర్ధారిస్తారన్నారు.క్యాంపు నకు హాజరు అయ్యేవారు వారికి సంబందిచిన మెడికల్ రిపోర్ట్ లు తీసుకొని రావలెనని సూచించారు.ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారని, దాని ప్రకారం యూడీఐడీ కార్డును పోస్టులో ఇంటికే పంపుతారన్నారు. ఈ విధానం వల్ల సదరం సర్టిఫికెట్ల మాదిరిగా రోజుల తరబడి హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని ,వెబ్సైట్లో వివరాలు నమోదు చేయగానే ఒక ఎన్రోల్మెంట్ నంబర్ కేటాయిస్తారని అప్లికేషన్ స్టేటస్ ను ఈ ఎన్ రోల్ మెంట్ నంబర్ మరియు పుట్టిన తేదీ ద్వారా తెలుసు కోవచ్చు అన్నారు.ఇంకా కార్డు రాని వారు తమ కార్డు జనరేట్ అయ్యిందా ? లేదా అనేది యూడీఐడీ పోర్టల్లో ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ ద్వారా తెలుసు కోవచ్చు అన్నారు. ఒకవేళ కార్డు పోయినట్టయితే యూడీఐడీ పోర్టల్లో పీడబ్ల్యూడీ లాగిన్లోకి వెళ్లి ‘కార్డ్ లాస్ట్’ ఆప్షన్ ఎంచుకోవాలని, తర్వాత అందులో వివరాలు నమోదు చేస్తే కొత్త కార్డు ఇంటికి వస్తుందని గతంలో సదరంలో తిరస్కరించిన వారు కూడా యూడీఐడీలో కొత్తగా అప్లై చేసుకోవచ్చన్నారు.21 రకాల వైకల్యాలకు..వికలాంగుల హక్కుల చట్టం (ది రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ యాక్ట్) 2016 ప్రకారం కేంద్ర ప్రభుత్వం 21 రకాల వైక్యాలను గుర్తించిందని అన్నారు. ఇప్పటివరకు సదరంలో బ్లెండ్నెస్లో విజన్,లెప్రసీ క్యూర్డ్, హియరింగ్ ఇంపేయిర్మెంట్, లోకోమోటర్ డిజేబిలిటీ, మెంటల్ రిటార్డేషన్, మెంటల్ ఇల్ నెస్కు మాత్రమే సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. యూడీఐడీలో ఈ ఏడింటితో పాటు మరో 14 రకాలను సైతం చేర్చారు.ఆటిజమ్ స్పెక్ట్రమ్, సెరబ్రల్ పాల్సీ, క్రానిక్ న్యూరోలాజికల్ కండీషన్స్, డ్వార్ఫిజమ్ (మరుగుజ్జు), హీమోఫీలియా, మల్టీపుల్ స్కైరోసిస్, మస్క్యులర్ డిస్ట్రోఫీ, పార్కిన్సన్, సికిల్సెల్, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజేబిలిటీ, థలసేమియా, ఆసిడ్ అటాక్ విక్టిమ్స్, మల్టీపుల్ డిజేబిలిటీస్ను సైతం యూడీఐడీలో చేర్చారుకేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన యూడీఐడీ కార్డుల కోసం దివ్యాంగులు మీ–సేవలో అప్లై చేసుకోవాలి లేదా తమ దగ్గర ఉన్న ఫోన్ లేదా కంప్యుటర్ లలో నైన www.swavlambancard.gov.in లాగిన్ లో కెళ్ళి తమ పేర్పు నమోదు చేసుకోవాలని అన్నారు.
ఇప్పటికే సదరం సర్టిఫికెట్ పొందిన వారికి యూడీఐడీ కార్డు డైరెక్ట్ గా వారు నమోదు చేసుకున్న ఇంటి అడ్రస్ కు పోస్ట్ ద్వారా వస్తుందన్నారు. కొత్తగా సర్టిఫికెట్ కావాల్సిన వారు, గతంలో సదరంలో రిజెక్ట్ అయిన వారితో పాటు సదరం సర్టిఫికెట్ గడువు ముగిసి రెన్యూవల్ కోసం ఎదురుచూస్తున్న వారు మాత్రమే యూడీఐడీ కోసం అప్లై చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమానికి డి. ఎం. & హెచ్.వో సాంబశివరావు , ప్రిన్సిపాల్ నర్సంపేట మెడికల్ కాలేజ్ ,, మరియు సంబంధిత శాఖల అధికారులతో పాటు వరంగల్ జిల్లా వికలాంగుల కమిటి సభ్యులు తదితరులు హాజరు కావడం జరిగింది.
