Jaibharathvoice.com | Telugu News App In Telangana
కామారెడ్డి జిల్లా

జుక్కల్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలిబిచ్కుంద  మార్కెట్ కమిటీ చైర్మన్కవితా ప్రభాకర్ రెడ్డి

జై భారత్ వాయిస్ న్యూస్ కామారెడ్డి
కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు మంత్రి పదవి ఇవ్వాలని బిచ్కుంద మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి  పటేల్ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా జుక్కల్ ఎమ్మెల్యేకు మంత్రిగా స్థానం కల్పించాలని వారు కోరారు. జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా లక్ష్మీ కాంతారావు గెలిచిన 15 నెలల్లోనే నియోజ కవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు సరైన రీతిలో అమలు చేశారన్నారు ఇప్పటివరకు వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గంలో 95 కోట్ల పైచిలుకు నిధులు సిసి రోడ్ల కోసమే మంజూరు చేయించి పనులు జరిగేలా చూస్తున్నారని అన్నారు. పరిపాలన పట్ల పూర్తి అవగాహన ఉన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు మంత్రి పదవి ఇస్తే వెనుకబడిన  నియోజక వర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా   మరింత అభివృద్ధి జరుగు తుందని వారు అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాల్సిం దిగావారు విజ్ఞప్తి చేశారు.

Related posts

టిజిపిఎస్సీ హిందీ లెక్చరర్ స్టేట్ లో మద్నూర్ యువకునికి నాల్గవ ర్యాంకు

Valanke sachin kumar

పెద్ద ఎక్లరా లో ఘనంగా ట్రాక్టర్ ర్యాలీ

ప్రమాదకరంగా మారిన కల్వర్టుపై గుంత

Valanke sachin kumar