ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయొద్దు …….సెకండ్ గ్రేడు టీచర్స్ యూనియన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు మురళి.
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల వారు వ్యవహరిస్తున్న తీరు ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని వరంగల్ జిల్లా సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు పోతరాజు మురళి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సంవత్సరంలో 50 శాతం సెలవులు ఉంటాయని అనడం సహేతుకమైనటువంటి అంశం కాదని మిగతా డిపార్ట్మెంట్ల వారిగానే ఉపాధ్యాయుల 220 రోజుల మొత్తం పని గంటల తో కలిపి రెండు రోజుల కంటే తక్కువ పని దినాలు ఉన్నాయని చెప్పారు. సెలవులు పిల్లల కే గాని టీచర్లకు గాదని అన్నారు. సెలవులలో శిక్షణలు, బడి బాట వంటి విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. మిగతా శాఖల లో సంవత్సరానికి ఒక నెల అదనంగా 25 రోజుల వేతనం ప్రభుత్వం అదనంగా అందిస్తున్నారని చెప్పారు. దాదాపు 13 నెలల వేతనం పొందుతారని అన్నారు. ఆ విషయాన్నిచెప్పడం లేదని అన్నారు. అదేవిధంగా మిగతా దేశాలతో పోలిస్తే మనదేశంలోనే తక్కువ సెలవు దినాలు ఎక్కువ పని దినాలు ఉన్నాయని ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం సానుకూల వైఖరిని ఏర్పరచుకొని వారి ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడొద్దని, చెప్పారు .ఐదు డిఏలు, పిఆర్సి గూర్చి అడిగేసరికి ,ఇలా ప్రవర్తిస్తున్నారు అనే అపోహ ఉపాధ్యాయ వర్గాల్లో కలుగుతుందని అన్నారు. ఉపాధ్యాయులు అందించే సేవలను తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఆరోపించారు. అదే విధంగా ఏ శాఖ. చేయ లేని పనులు ఎన్నికల విధులు, సర్వేలు ,జనాభా లెక్కలు, సమగ్ర సర్వే చేస్తున్నారని వివరించారు. ఉపాధ్యాయులు ఉంటేనే ఏ ఎన్నికలైనా సజావుగా జరుగుతాయని చెప్పారు.

previous post