April 9, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పరీక్షలు ప్రారంభం!

హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో బిఏ, బీకాం, బీఎస్సీ నాలుగవ, ఆరవ సెమిస్టర్ పరీక్షలు బుధవారం నుండి ప్రారంభమైనవి. పరీక్షల నిర్వాణ విధానాన్ని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య. సుంకరి జ్యోతి, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సుధీర్, అధ్యాపకుడు డాక్టర్ సాయి చరణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టామని, పరీక్షలు రాసే విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామన్నారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించబడుతున్నాయని ప్రిన్సిపల్ జ్యోతి తెలిపారు.

Related posts

జాతర సేవకు ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు!

Jaibharath News

ప్లాస్టిక్ రహిత సంచుల తయారీ కేంద్రాన్ని సందర్శించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే

పెద్దపూర్,లింగమడుపల్లి లో బిజెపి నేతలు గడపగడపకు కరపత్రాల పంపిణీ

Jaibharath News