తెలంగాణ సాయుధ పోరాటం తొలి పోరాటయోధుడు దొడ్డి కొమరయ్యను ఆదర్శంగా తీసుకుని జీవన విధానాన్ని అలవర్చుకోవాలని అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి అన్నారు. దొడ్డి కొమురయ్య 98వ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ భూమికోసం, ముక్తి కోసం విముక్తి ఉద్యమంగా కడవెండి గ్రామంలో ఒక సాధారణ కురుమ కులానికి చెందిన గొర్రెల కాపరుల కుటుంబంలో జన్మించిన కొమురయ్య ఒక మహోన్నత ఉద్యమానికి హాజరు కావడం గర్వకారణమని అన్నారు. అప్పట్లో నిజాం పాలనలో జాగిదారులు, దేశ్ముకులు, భూస్వాములు, పాండేలు, మొదలైన దొరల ఆగడాలకు విసిగి వేసారిన ప్రజలను చైతన్యపరిచి జనగామ తాలూకా విసునూరు దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి ఆధీనంలో నున్న 60 గ్రామాలలో ఒకటైన కడవెండి రామచంద్రారెడ్డి తల్లి జానకమ్మకు వ్యతిరేకంగా అనేకమార్లు గొడవలు జరగడం తొలిసారిగా పన్నులు చెల్లింపు కార్యక్రమాన్ని నిలిపివేయడం జరిగింది కొమురయ్యను హతమార్చాలని కక్ష సాధింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం 60 మంది వాలంటరీ దళాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంతటి ఉద్యమ స్ఫూర్తి స్మరించుకోవడం ఎంతైనా ఉందని ఆయన అన్నారు సుమారు 200 మంది ప్రజలు పైగా దొరలకు వ్యతిరేకంగా నినాదాలతో ఆ ప్రదేశాలంతా ఊరిస్తూ ర్యాలీగా బయలుదేరిన సమయంలో గడికి ఎదురుగా ఉన్న ప్రైవేటు రక్షణ దళం ర్యాలీగా వస్తున్న ప్రజలను చూసి దిగ్వాంతులై మిష్కల్ అలీ నాయకత్వంలోని దొరల రక్షణ బృందం కాల్పులు జరపడం జరిగింది ఆ క్రమంలో దొడ్డి కొమరయ్య మరణించడం జరిగింది శాంతియుతంగా జరుగుతున్న రైతాంగ ఉద్యమానికి దొడ్డి కొమురయ్య మరణం స్ఫూర్తిదాయకమై చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు సైతం దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది, అని దొరల ఆధీనంలో ఉన్న భూములను పంచడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ వైవి గణేష్, బీసీ వెల్ఫేర్ అధికారి రాంరెడ్డి, జిల్లా కోశాధికారి శ్రీనివాస్ కుమార్, జిల్లా టూరిజంఅధికారి. శివాజీ, జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం కార్యదర్శి ఆస్నాల శ్రీనివాస్ గౌడ సంఘం అధ్యక్షులు రామస్వామి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు శ్యామ్, ఎన్జీఓ నాయకులు మండల పరశురాములు వివిధ కుల సంఘ నాయకులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు .

previous post