Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

జాబ్ మేళా పోస్టర్ విడుదల చేసిన మంత్రి సురేఖ

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా తాను ప్రత్యేక చొరవ తీసుకొని ఏప్రిల్ 11న వరంగల్ జిల్లా నిరుద్యోగ యువతీ, యువకులకు టాస్క్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్న మెగా జాబ్ మేళా పోస్టరును స్థానిక కలెక్టర్ సత్య శారదా… వరంగల్ మేయర్ గుండు సుధారాణి తదితర నాయకులతో మంత్రి కొండా సురేఖ శనివారం రీలీజు చేశారు. జిల్లాలో నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సురేఖ సూచించారు. జిల్లా పర్యటనలో భాగంగా జాబ్ మేళాకు సంబంధించిన పోస్టురును విడుదల చేస్తూ మంత్రి మీడియాతో మాట్లాడారు. వరంగల్ జిల్లా యువతీ యువకులందరూ మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొని, తమ పేరును నమోదు చేసుకొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవల్సిందిగా కోరారు.నిర్వాహకులు విడుదల చేసిన పోస్టర్ లో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులు ఎన్ రోల్ చేసుకోని ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలన్నారు. ఏప్రిల్ 11వ తేదీన ఉదయం 9:30 గంటల నుండి ప్రారంభం అవుతుందని మంత్రి గుర్తు చేశారు.

Related posts

ఆమ్మ ఆదర్శ పాఠశాలల పనులు జూన్ 5 కల్లా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య

బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిక

Jaibharath News

పర్వతగిరిలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పర్యటన