జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్:.రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం దేశానికి ఆదర్శమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు శనివారం వరంగల్ నగరంలోని తూర్పు నియోజకవర్గం జిడబ్ల్యూఎంసీ పరిధిలోని 27వ డివిజన్ గోవిందరాజులగుట్ట, 32వ డివిజన్ లోని ఎస్ ఆర్ ఆర్ తోట, 37 డివిజన్ తూర్పు కోట కొత్త గడ్డ, 18వ డివిజన్ లేబర్ కాలనీ గాంధీనగర్ చౌక ధరల దుకాణాలలో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని మంత్రి శ్రీమతి కొండా సురేఖ, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్వినీ తానాజీ వాఖేడే లతో కలసి ప్రారంభించి లబ్ధిదారులకు సన్న బియ్యం అందజేశారు.ఈ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బల్దియా ఆధ్వర్యంలో పలు పథకాల క్రింద రూ 62 లక్షల వ్యయంతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.బల్దియా పరిధిలోని 27 వ డివిజన్ డివిజన్లో 30 లక్షల రూపాయల వ్యయంతో బల్దియా జనరల్ ఫండ్ నిధులతో నిర్మించే లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ ఓపెన్ షెడ్ పనులకు, 26వ డివిజన్ సిఖ్ వాడాలో బల్లియా ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలప్రత్యేక అభివృద్ధి నిధులతో నిర్మించే సిఖ్ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ పనులకు, 42 వ డివిజన్ రంగశాయిపేట లెనిన్ నగర్ లో 22 లక్షల రూపాయల స్పెషల్ డెవలప్మెంట్ నిధులతో నిర్మించే అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శ్రీమతి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే సంబంధిత కార్పొరేటర్లతో కలసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ నిరుపేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో ప్రారంభించిన సన్నబియ్యం కార్యక్రమం ఎంతో విజయవంతం అయిందని లబ్ధిదారులు కూడా దానిని సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు. గతంలో దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల దళారీ వ్యవస్థ ఏర్పడి రేషన్ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు అమ్ముకుని సొమ్ము చేసుకునే వారిని నేడు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంతో ప్రతి లబ్ధిదారుడు సన్నబియాన్నే వినియోగించుకుంటూ అక్రమ దందాకు అడ్డుకట్ట వేసినట్లు అయిందని మంత్రి సురేఖ తెలిపారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మదిలో చిరస్థాయిగా నిలుస్తుందని తెలిపారు. రాబోయే రోజులలో మరిన్ని సంక్షేమ పథకాలతో అప్పుల రాష్ట్రాన్ని అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రులు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారని తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో 21 వేల కోట్ల రైతు రుణమాఫీ, రైతు భరోసా కింద 12 వేల కోట్ల రూపాయలు మొత్తం 15 నెలల్లో 33 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసి రైతుల గుండెల్లో ఇందిరా గాంధీ సోనియా గాంధీ ల పేర్లు శాశ్వతంగా ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. సన్న బియ్యం పంపిణీ పథకం శాశ్వతంగా నిలిచిపోయే పథకం అన్నారు. వరంగల్ జిల్లాలో 509 రేషన్ షాపుల ద్వారా 2 లక్షల 66 వేల 429 తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు ప్రతి నెల 50 వేల 145 క్వింటాళ్ల సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలోఅదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్ లుచింతాకుల అనిల్ కుమార్, పల్లం పద్మ, ముష్కమల్ల అరుణ, భోగి సువర్ణ, వస్కుల బాబు, పోశాల పద్మబాల్నే సురేష్, చింతాకుల అనిల్ కుమార్,గుండు చందన పూర్ణ చందర్,,జిల్లా పౌరసరఫరాల అధికారి కిష్టయ్య, పోరా సరఫరాల జిల్లా మేనేజర్ సంధ్యారాణి, బల్దియా ఎస్ ఈ ప్రవీణ్ చంద్ర, ఈఈ శ్రీనివాస్, ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

previous post