Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సిటీ పోలీస్‌ యాక్ట్‌ అమలు

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ  వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఎప్రిల్  ఆరవ తేదీ నుండి నెల రోజుల  పాటు 30 సిటీ పోలీస్‌ యాక్ట్‌ అమలులో వుంటుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా మీటింగ్‌ ర్యాలీలు, ఉరేగింపులను నిర్వహించడం నిషేధించబడ్డాయి. అలాగే ఎవరైన బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరమని, అలాగే వృద్దులు, రోగులతో పాటు, విధ్యార్థుల చదువులను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు , శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో డీజే సౌండ్‌లను వినియోగించడంపై నిషేధాన్ని కోనసాగించడం జరుగుతుందని. ఎవరైన తప్పని సరిగా మైక్‌లను ఏర్పాటు చేయాలనుకునేవారు తప్పని సరిగా సంబంధిత ఏసిపి అధికారుల నుండి తప్పని సరిగా అనుమతులు తీసుకోవాల్సి వుంటుందని. మైక్‌ కేవలం ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మాత్రమే వినియోగించుకోవాల్సి వుంటుందని. ఎట్టి పరిస్థితుల్లో రాత్రి సమయాల్లో మైకులను వినియోగించరాదని,అలాగే హస్పటల్స్‌, విద్యాలయాలకు వంద మీటర్ల పరిధిలో మైకులను ఏర్పాటు చేయరాదని,  ఈ నిషేధ ఉత్తర్వులు తేది06-04-25 నుండి తేది05-05-25 వరకు అమలులో వుంటుందని, ఏవరైన ఈ ఉత్తర్వులను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలియజేసారు.

Related posts

సోమయ్య సేవలు మరువలేము

చైర్స్ పంపిణీ చేసిన ఆర్,ఐ కాలువల శ్రీనివాస్

Jaibharath News

హర్జియా తండా లో వైద్య శిబిరం