Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం

(జై భారత్ వాయిస్ఆత్మకూరు) :
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆత్మకూరు మండల కేంద్రంలోని వేణు గోపాల స్వామి ఆలయం లోను షిరిడి సాయిబాబా ఆలయంలో, నీరుకుల్ల లోని శ్రీ వేణు గోపాలస్వామి ఆలయం లోను, అక్కంపేట లోని రామాలయం లోను సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండు వ గా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్యన సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కళ్యాణాన్ని తిలకించి తరించారు. సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని తిలకించిన భక్తజనులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సీతారాముల కళ్యాణ తలంబ్రాలను, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం నీరుకుల్ల శ్రీ వేణుగోపాలయం లో పోతరాజు హిమానవి కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించడంభక్తులను ఆకట్టుకుంది. వివిధ ఆలయాలలో ప్రసాదాలను పంపిణీ చేశారు. అన్నదానాలను సైతం నిర్వహించారు. భక్తులు కల్యాణం తో భక్తి పారవశ్యం లో మునిగి పోయారు. ఆలయాలలో భక్తులకు తాగునీటి సదుపాయం ఏర్పాటు చేశారు. మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు

Related posts

పరకాల నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి సమీక్ష సమావేశం

పెద్దమ్మగడ్డ దళితుల సమాదులను పరిరక్షించాలని పెద్దమ్మగడ్డ X రోడ్డు వద్ద ధర్నా చేస్తున్న దళితులకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

Sambasivarao

వికారాబాద్ కలెక్టర్ మీద జరిగిన దాడిని తెలంగాణ రాష్ట్ర తహశీల్దార్ల అసోసియేషన్ రాష్ట్ర నేతల ఖండన