భారత్ వాయిస్ న్యూస్ వరంగల్, 8 ఏప్రిల్ వరంగల్ నగరంలోని సికే నాయుడు కన్వెన్షన్ హల్ లో ఈ నెల 11వ తేదీనజరిగే జాబ్ మేళా కు పక్కడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ నెల 11న ఉదయం 9:30 గంటల నుండి జరిగే మెగా జాబ్ మేళా ఏర్పాట్ల పై నిర్వాహకులు, జిల్లా అధికారులతో కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించి సమర్ధవంతంగా నిర్వహించుటకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ ప్రత్యేక చొరవ తీసుకొని వరంగల్ జిల్లా యువతీ, యువకులకు ఉద్యోగాలు కల్పించాలనే ముఖ్య ఉద్యేశ్యంతో టాస్క్ సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత అందరూ సద్వినియోగం చేసుకునే విధంగా అధికారులు అంకితభావంతో ఎలాంటి లోటుపాట్లు జరగకుండాప్రణాళిక బద్దంగా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు.60కు పైగా వర్చుసా, జంపాక్, ఫ్యాక్ కోన్ వంటి మల్టీ నేషనల్ కంపెనీలు పాల్గొని వేలాది మందికి పైగా ఉద్యోగాలు కల్పించనున్న నేపధ్యంలో మెప్మా, డిఆర్డీఓ, జిల్లా సంక్షేమ, యువజన శాఖలు, ఉపాధి కల్పన తదితర సంబంధిత శాఖల ద్వారా నిరుద్యోగ యువత పెద్దఎత్తున నమోదు చేసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనితోపాటు వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ కోరారు.జాబ్ మేళాకు హాజరయ్యే వారికి వేసవి దృష్ట్యా జాబ్ మేళాకు హాజరయ్యే వారికి ఇబ్బందులు కలుగకుండా భోజనం, మంచి నీటి సౌకర్యం, అంబులెన్స్, ఆరోగ్య శిబిరం, నిరంతారాయ విద్యుత్తు, అగ్నిమాపక యంత్రాలు, పారిశుద్ధ్య నిర్వహణ, పోలీస్ బందోబస్తు, ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.కాగా, ఇటీవల మంత్రి శ్రీమతి కొండా సురేఖ క్యూఆర్ కోడ్ తో గల పోస్టర్ విడుదల చేశారని,వరంగల్ జిల్లా నిరుద్యోగ యువత మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొని, ముందస్తుగా తమ పేర్లు నమోదు చేసుకొవాలని కలెక్టర్ కోరారు.ఈ సమావేశంలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రత్యేక అధికారి శ్రీరాములు శ్రీనివాస్,జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిఆర్డీఓ కౌసల్యాదేవి, ఏసీపీ. నందిరామ్ నాయక్, జిల్లా అధికారులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
