Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మోదుగ విస్తరిలో ఎమ్మెల్యే యశస్వనీ రెడ్డి, కలెక్టర్ సత్య శారదా రేషన్ బియ్యంతో భోజనం

జై భారత్ వాయిస్ న్యూస్ రాయపర్తి. వరంగల్ జిల్లాపాలకుర్తి నియోజక వర్గం రాయపర్తి మండలం కోలన్ పల్లిలో బుధవారం సన్న బియ్యం లబ్ధిదారుడైన  చిట్యాల పెద్ద సోమయ్య రాజనర్సమ్మ దంపతుల  ఇంట్లో ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి , జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రభుత్వం ఉచితంగా అందించిన సన్న బియ్యంతో తయారు చేసిన భోజనం చేశారు. లబ్ధిదారులను నాణ్యత ఎలా ఉంద ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజా ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేద ధనిక తేడాలు లేకుండా సన్నబియ్యాన్ని రేషన్ ద్వారా అందించి కడుపునిండా భోజనం చేసే అవకాశం కల్పించినందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అందుకు నియోజకవర్గ ప్రజల తరపున సీఎం గారికి కృతజ్ఞతలు తెలిపారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సన్న బియ్యాన్ని నిరుపేదలకు అందించి ఆరోగ్యవంతంగా జీవితాన్ని అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయం చాలా గొప్పదని అన్నారు.పేదవాడి కడుపు నింపేందుకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేపట్టిందని తెలిపారు. అన్నదాత సుఖీభవ అనే సూక్తులతో ఈరోజు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి , జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గార్లు ఇంటి యజమాని దంపతులకు నూతన వస్త్రాలను అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి డి సి ఓ నీరజ, డి ఆర్ డి ఓ కౌసల్య దేవి, డి యం సివిల్ సప్లై సంధ్యారాణి, రాయపర్తి తాహశీల్దార్ శ్రీనివాస్ ఎంపీడీవో కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆకతాయిలకు షీ టీం బృందం కౌన్సిలింగ్

కపాలని మాతగా భద్రకాళి మాత దర్శనం

స్కూల్ యూనిఫాం సిద్ధం చేయాలి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య