Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

పోలీసుల పరిశీలనలో బిఆర్‌ఎస్‌ సభ అనుమతి

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ
బిఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించి నెల 27వ తేదిన ఎల్కతుర్తి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బిఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించనున్న సభ నిర్వహణకు అనుమతి కోరుతూ సభా నిర్వహకులు గత మార్చినెల 28 తేదిన వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. అదే రోజు భద్రత ఏర్పాట్లతో పాటు, ట్రాఫిక్‌ సమస్యలను నివారించేందుకు, సభకు ఎంతమంది హజరవుతారు, ఏఏ ప్రాంతాలను నుండి తరలి వస్తారు, ఎన్ని వాహనాలు వస్తాయి, వాహన పార్కింగ్‌ స్థలాల ఏర్పాట్లు, సభ జరిగే ప్రాంతం విస్తీర్ణంకు సంబంధించిన వివరాలను సమర్పించాల్సిందిగా నిర్ధిష్టమైన ఫార్మాట్‌ను పోలీస్ అధికారులు బిఆర్‌ఎస్‌ నాయకులకు అందజేయడం జరిగింది. కాని బిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు వరంగల్‌ పోలీస్‌ శాఖ అడిగిన సమచారాన్ని ఇవ్వకుండా, వరంగల్‌ సభకు అనుమతి ఇవాల్సిందిగా కోరుతూ బిఆర్‌ఎస్‌ నాయకత్వం ఈ నెల 9వ తేదిన హైకోర్టులో దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అ తర్వాత వరంగల్‌ పోలీస్‌ శాఖ కోరిన సమాచారాన్ని బిఆర్‌ఎస్‌ నాయకులు ఈ నెల 10వ తేది ఆర్థరాత్రి 12 గంటలకు ( తెల్లవారితే 11వ తారీకు) వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులకు అందజేయడం జరిగింది. బిఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ సభ అనుమతి కొరకు చేసుకున్న దరఖాస్తు ప్రస్తుతం పరిశీలనలో వుంది.

Related posts

రాష్ట్ర ప్రభుత్వం గొర్ల పంపిణీ వేగవంతం చేయాలి

Jaibharath News

విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం

కుట్టు మిషన్లను పంపిణీ