(jaibharathvoicenews hanamakonda)ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఈనెల 14వ తేదీ సోమవారం నిర్వహిస్తున్న జ్ఞాన యాత్రలో జిల్లా ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు పిలుపునిచ్చారు. హన్మకొండ ప్రెస్ క్లబ్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. అంబేద్కర్ అందరి వ్యక్తి, అందరి శక్తి అని కొందరికే పరిమితం చేయడం సరికాదన్నారు. అలాగే, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు ఆధ్వర్యంలో ప్రతి ఏటా జరుపుతున్నట్లుగానే అన్నివర్గాల వారిని భాగస్వామ్యం చేస్తూ ఈ ఏడాది కూడా విజ్ఞాన యాత్రను నిర్వహిస్తున్నామన్నారు. పది విభిన్న మతాలు, 25 వేల కులాలున్న మన భారత దేశంలో కాలమాన పరిస్థితులకు, ప్రజల సామాజిక, ఆర్ధిక, రాజకీయ అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకునే గొప్పగా రూపొందించారని వారు కొనియాడారు.భారత రాజ్యంగ విలువలను వివరిస్తూ వరంగల్ ఎంజీఎం సెంటర్ నుంచి హన్మకొండ అంబేద్కర్ విగ్రహం సాగే ఈ యాత్రలో దళిత, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, కార్మికులు, ఉద్యోగులు, మహిళలు, యువతతోపాటు అన్నివర్గాల ప్రజలు పాల్గొని అంబేద్కర్ మహాశయునికి నివాళులర్పించాలని డీసీసీ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు కోరారు. సమావేశంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మారుపాక ఎల్లయ్య, రైల్వే జేఏసీ అధ్యక్షులు కోండ్ర నర్సింహరావు, మాల మహానాడు జాతీయ నాయకుడు మన్నె బాబురావు, డీబీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు అంకేశ్వరపు రాంచందర్, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కడారి కుమార్, జాతీయ మాల మహానాడు గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు పనికల శ్రీనివాస్, విగ్రహాల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు బండి అశోక్, 50వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంకా హరిబాబు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రుద్రోజు మణీంద్రనాథ్, మాల మహానాడు నాయకులు కాళేశ్వరపు రామన్న తదితరులు పాల్గొన్నారు.
