(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) :
ఆత్మకూరు లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రా కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు సోమవారం మండల కేంద్రంలో సర్ఫ్ పౌరసరఫరాల శాఖ సరస్వతి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటైన కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ దళారులను ఆశ్రయించి మోసపోకూడదన్నారు గ్రామంలోని కేంద్రాల్లో దాన్ని విక్రయించాలన్నారు. ప్రభుత్వం రబీ సీజన్లో ని ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తుందన్నారు. ప్రభుత్వం సన్న రకానికి అదనంగా 500 రూపాయల బోనస్ చెల్లిస్తుందన్నారు. 17 శాతం మ్యాచ్ వచ్చే విధంగా రైతులు ఆరబెట్టుకోవాలని ఆయన సూచించారు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు రైతులకు సంచుల కొరత లేకుండా చూడాలన్నారు కార్యక్రమంలో ఆత్మకురు మార్కెట్ చైర్మన్ బీరం సునంద సుధాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్ ఆత్మకూర్ మాజీ పి ఎస్ సిస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్ మాజీ సర్పంచ్ పర్వతగిరి రాజు, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షలు మాదాసి శ్రీధర్, మండల యూత్ అధ్యక్షులు తనుగుల సందీప్, ఖాజామియా తదితరులు పాల్గొన్నారు.

previous post
next post