Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

బాల్య మిత్రుడికి ఆర్థిక సహాయం

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):ఆత్మకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల లో 1996_ 1997సంవత్సరంలో ఎస్ఎస్సి బ్యాచ్ చదువుకున్న విద్యార్థులలో తమ తోటి మిత్రుడు బెజ్జం మహేందర్ గుండెపోటుతో ఇటీవల మృతి చెందాడు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక మహేందర్ తండ్రి కూడా మృతి చెందడం ఆ ఇద్దరి మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెల కొన్నాయి. తోటి మిత్రులు అందరూ కలిసి మిత్రుడి చిత్రపటానికి పూలమాలవేసి, నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, తోటి మిత్రులు అందరూ కలిసి .రూ 45 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ మిత్రుడి కుటుంబానికి అండగా ఉంటామని, ఆపదలో వున్న ప్రతి మిత్రునికి అండగా ఉంటూ వారి కష్టసుఖాలలో పాలుపంచుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బూర బాలకృష్ణ, వంగాల భగవాన్ రెడ్డి,కక్కెర్ల రాజు, బరుపట్ల కిరీటి,బలబద్ర రాజకుమార్,బూర రామకృష్ణ,కర్ణాకర్ రెడ్డి,శంకర్, సతీష్,సంపత్, రమేష్, పెరుమాండ్ల రామకృష్ణ సురేందర్,హుస్సేన్,సూరయ్య జితేందర్,సురేష్,తోట దేవేందర్,జగన్ తదితరులు పాల్గొన్నారు,

Related posts

ఆత్మకూరు పంచాయతీ అధికారికి ప్రశంసా పత్రం

Jaibharath News

ఆర్ట్స్ కళాశాలలో ఇఫ్తార్ విందు!

8 నుంచి ఊరుగొండ ‌‌లక్ష్మీనర్సింహస్వామి కళ్యాణోత్సవాలు,జాతర

Jaibharath News