(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):ఆత్మకూరు మండలంలోని నీరుకుల్ల గ్రామంలో రాత్రి భారీగా వీచిన గాలులకు కురిసిన భారీ వర్షానికి ఓ రైతుకు చెందిన రెండేకరాల వరి పంట నేలమట్టం అయిందనీ వాపోయారు. నీరుకుల్ల గ్రామానికి చెందిన యువరైతు వంగేటి ప్రభాకర్ చెందిన వరి పంట నేలమట్టం అయిందని వాపోయారు .వరి పంట నేలమట్టం కావడంతో ఎంతో కష్టపడి పెట్టుబడి పెట్టి పంట చేతికి వస్తుందని తరుణం లో భారీ వర్షం వల్ల పూర్తిగా పంట నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నష్టం విలువ రెండు లక్షల వరకు ఉంటుందని వాపోయారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని మండలానికి చెందిన రైతులు పలువురు కోరుతున్నారు మండలంలోని వివిధ గ్రామాల్లో వరి పంటతో పాటు మొక్కజొన్న పంట కూడా నేలమట్టమయ్యా అని పలువు రైతులు తెలుపుతున్నారు నష్టపోయిన రైతులందరికీ వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లోకి వచ్చి ఫీల్డ్ సర్వే చేసి నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వ దృష్టికి తెచ్చి వారి అందరికీ నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రణాళికలు తయారుచేసి నష్టపోయిన రైతులందరికీ ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.

previous post
next post