(జై భారత్ వాయిస్ నర్సంపేట)
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండల పరిధిలో మనుబోతుల గడ్డ అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షంలో భాగంగా భూక్య శిరీష కుమారుడు సన్నీని అక్షరభ్యాసం చేయించడం జరిగిందని అంగన్వాడీ టీచర్ తేజావత్ కవిత తెలిపారు.తేజావత్ కవిత మాట్లాడుతూ గర్భిణీ, బాలింతలకి పిల్లల తల్లులకి పౌష్టికాహారంగురించి వివరించడం జరిగిందని చెప్పారు.. వెయ్యి రోజుల ప్రాముఖ్యత పిల్లల భవిష్యత్తుకు పిల్లల పోషణ లోపానికి గురికాకుండా చూసుకోవాలని ఆరోగ్యం కరమైన జీవనశైలితో పిల్లలను చూడాలని ఆమె వివరించారు. పోషణ అభియాన్ ప్రోగ్రాం ను విజయవంతం చేయడం జరిగిందని అన్నారు.పిల్లల తల్లులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు

previous post